లోకేష్ స్నేహితుడికి రూ. 363 కోట్ల భూమి గిఫ్ట్!
ఏపీలో భూముల ధరలు చుక్కలనంటుతున్న వేళ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కారుచౌకగానే కావాల్సిన కంపెనీలకు కోట్లాది విలువైన భూమిని ధారదత్తం చేస్తోంది. మొన్న సీఆర్‌డీఏ పరిధిలో బాలయ్య వియ్యంకుడికి 300 కోట్ల విలువైన 498 ఎకరాల భూమిని కారుచౌకగా అప్పగించిన చంద్రబాబు… నిన్న రేణిగుంట విమానాశ్రయం దగ్గర్లో గల్లా అరుణకుమారి కుటుంబానికి రూ. 48 కోట్ల విలువైన భూమిని ఇచ్చేసిన ప్రభుత్వం… ఇప్పుడో మరో భారీ భూపందేరానికి ప్లాన్ చేసింది. లోకేష్ స్నేహితుడి కోసం ఏకంగా 363 కోట్ల […]
ఏపీలో భూముల ధరలు చుక్కలనంటుతున్న వేళ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కారుచౌకగానే కావాల్సిన కంపెనీలకు కోట్లాది విలువైన భూమిని ధారదత్తం చేస్తోంది. మొన్న సీఆర్‌డీఏ పరిధిలో బాలయ్య వియ్యంకుడికి 300 కోట్ల విలువైన 498 ఎకరాల భూమిని కారుచౌకగా అప్పగించిన చంద్రబాబు… నిన్న రేణిగుంట విమానాశ్రయం దగ్గర్లో గల్లా అరుణకుమారి కుటుంబానికి రూ. 48 కోట్ల విలువైన భూమిని ఇచ్చేసిన ప్రభుత్వం… ఇప్పుడో మరో భారీ భూపందేరానికి ప్లాన్ చేసింది. లోకేష్ స్నేహితుడి కోసం ఏకంగా 363 కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.
విశాఖలోని మధురవాడ ప్రాంతంలో 50 ఎకరాలను ఎకరం 50 లక్షలకే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం . ఇక్కడ ప్రస్తుతం ఎకరం భూమి విలువ రూ. 7.26 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ భూ నిర్వాహణ సంస్థే ఈ ధరను నిర్ణయించింది. ఈ -సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్‌కు చెందిన పారండైం నాలెడ్జ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీకి ఈ భూమి అప్పగిస్తున్నారు. ఈ కంపెనీ అధినేత శ్రీధర్… లోకేష్ బాబుకు చాలా దగ్గర స్నేహితుడు. అందుకే 363 కోట్ల విలువైన భూమిని కేవలం 25 కోట్లకే అప్పగిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మధురవాడలోని సింహాద్రి అప్పన్న భూములను అప్పగించేందుకు తొలుత ప్లాన్ చేశారు. అయితే పెద్దెత్తున విమర్శలు రావడంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను గిఫ్ట్ ప్యాక్‌గా లోకేష్ స్నేహితుడి కంపెనీకి అప్పగిస్తోంది.