రఘువీరా ప్రకటనతో మండుతున్నసీమ వాసులు
నిన్న తిరుపతి లో కాంగ్రెస్ పార్టీ ఏపి అధ్యక్షులు రఘవీరా రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తిరుపతి క్యాన్సర్ హస్పిటల్ ని గుంటూరు కు తరలించే చర్యలను ఖండిస్తారేమో నని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ సంస్దను తెచ్చింది కాంగ్రెస్ కాబట్టి. కాని అందుకు బిన్నంగా స్పందించారు. సీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కాంగ్రెస్ వ్యతిరేకమని, 21 న తిరుపతి లో జరిగే సీమ సమాలోచనకు తాను రాను అని సెలవిచ్చారు. అప్పుడు గుర్తుకు వస్తుంది యం […]
Advertisement
నిన్న తిరుపతి లో కాంగ్రెస్ పార్టీ ఏపి అధ్యక్షులు రఘవీరా రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తిరుపతి క్యాన్సర్ హస్పిటల్ ని గుంటూరు కు తరలించే చర్యలను ఖండిస్తారేమో నని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ సంస్దను తెచ్చింది కాంగ్రెస్ కాబట్టి. కాని అందుకు బిన్నంగా స్పందించారు. సీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కాంగ్రెస్ వ్యతిరేకమని, 21 న తిరుపతి లో జరిగే సీమ సమాలోచనకు తాను రాను అని సెలవిచ్చారు. అప్పుడు గుర్తుకు వస్తుంది యం వి రమణారెడ్డిగారు పలికిన మాటలు. ఆగస్టు నెల 16 న తిరుపతి లో భూమన్ గారి సారధ్యంలో సీమ సమాలోచన జరిగింది. ఆ సమావేశానికి రాలేక పోయిన రమాణారెడ్డి గారు సమావేశానికి తన సందేశాన్ని పంపారు. అందులో వారు నొక్కి చెప్పింది ఓటర్లు మెజారిటీగా ఉన్నకోస్తాజిల్లాలను కాదని రాయలసీమను భుజానికి ఎత్తుకోవడానికి రాజకీయ పార్టీలలో ఏ ఒక్కటి ముందుకు రాదని.
ఇప్పుడు రఘువీరారెడ్డి మాటలు వింటే మనకు బోదపడేది కూడా అదే మరి. ప్రస్తుతం రాయలసీమ విద్యావంతులలో వ్యక్తమవుతున్న ఆవేదన ఒక్కటే. విభజన తర్వాత సీమ అస్దిత్వానికి ముప్పువాటిల్లుతుందని. సీమకు వివక్షపూరిత పాలన వద్దని. ఒక్కమాటలో చప్పాలంటే విముక్తి కావాలని మాత్రమే. ఇప్పటివరకు సీమలో జరుగుతున్నది సీమ గమ్యంపై సమాలోచన మాత్రమే. కొందరు విడిపోతే తప్ప మార్గం లేదంటుంటే మరి కొందరు పొరాడి మన హక్కులను కాపాడు కొందామంటున్నారు. కాని అందరిలో ఉన్నది సీమ బ్రతకాలని, ప్రభుత్వ వివక్షపూరిత విధానాలు ఇలానే కొనసాగితే మనుగడకే కష్టం అని. ఈ విషయాలు మాట్లాడాల్సిన రఘువీరాగారు సీమ వాడిగా ఉండి బాధ్యతలేకుండా వ్యవహరించారు. ఇంతవరకు సీమను రాష్ట్రం చేయమని ఒక్క చోట కూడా విధాన ప్రకటన చేయలేదు. సీమ ఆ కాంక్షలను విభజన వాదులుగా ముద్రవేయడం తప్ప వారి ప్రకటనకి మరో అర్దం లేదు. తిరుపతికి వచ్చినా కూడా తిరుపతి క్యాన్సర్ హస్పిటల్ ను గుంటూరుకు తరలించే ప్రయత్నాన్ని మాత్రం మాట వరసక కూడా ఖండించలేదు.
కేవలం 20 నెలల కాలంలోనే రాజధానిని తీసుకెల్లారు, 120 జీఓ ను తెచ్చి మెడికల్ సీట్లకు వెసురు పెట్టారు, త్రాగడానికి నీరు లేక మనం చస్తుంటే మన పేరు చెప్పి వారికి పట్టిసీమ కట్టి నీరు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇలా పాలకుల గమనం ఉంటే సీమ ప్రజల గమ్యం రాయలసీమ రాష్ట్రం కాక మరేమవుతుంది. కాని రఘవీరా రెడ్డికి ఒక్క విషయం లో దన్యవాదాలు చెప్పాలి 21 సమావేసానికి తాను రాను అన్నందుకు. వారి పార్టివారిని కూడా రాకుండా చేయగలిగితే సీమకు వారు ఇచ్చే మంచికానుక అవుతుంది.
Advertisement