మంత్రి ట్విట్టర్ ఖాతా హ్యాక్
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. @CimGOI అనే టాగ్ తో పదే పదే అనవసర సమాచారం ట్విట్టర్ అకౌంట్ పై పోస్టవుతూ ఉండడాన్ని గమనించిన ఆమె ఫాలోయర్లు ఈవిషయాన్ని నిర్మలా సీతారామన్ ను దృష్టి తీసుకెళ్లారు. వెంటనే నిర్మలా సీతారామన్ అప్రమత్తం అయ్యారు. తనను అప్రమత్తం చేసి సమాచారం ఇచ్చిన ఫాలోయర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు @CimGOI అనేది ఓ […]
Advertisement
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. @CimGOI అనే టాగ్ తో పదే పదే అనవసర సమాచారం ట్విట్టర్ అకౌంట్ పై పోస్టవుతూ ఉండడాన్ని గమనించిన ఆమె ఫాలోయర్లు ఈవిషయాన్ని నిర్మలా సీతారామన్ ను దృష్టి తీసుకెళ్లారు. వెంటనే నిర్మలా సీతారామన్ అప్రమత్తం అయ్యారు. తనను అప్రమత్తం చేసి సమాచారం ఇచ్చిన ఫాలోయర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు @CimGOI అనేది ఓ ప్రయివేటు కంపెనీకి చెందినదని గుర్తించారు. ఆ సంస్థ ఉత్పత్తిని నిర్మలా సీతారామన్ ట్విట్టర్ అకౌంట్ లో ప్రచారం చేసినట్టు గుర్తించారు. అయితే ఇదంతా సదరు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు ఎవరైనా చేశారా? లేక ఆకతాయిలు హ్యాక్ చేశారా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ క్రైం పోలీసు అధికారులు తెలిపారు
Advertisement