'వరంగల్‌'లో ప్రారంభమైన డబ్బుల పంపిణీ

వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అప్పుడే ధన ప్రవాహం మొదలయ్యింది. ఈ సెగ్మెంట్‌కు నోటిఫికేషన్‌ వెలువడగానే డబ్బుల సరఫరా జరగడం… వివిధ చెక్‌పోస్టుల్లో ఇప్పటికే 25 లక్షల రూపాయల వరకు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది నిఘాలో బయటపడిన మొత్తం. ఇది కాకుండా ఇప్పటికే నియోజకవర్గానికి నిధులు ఎక్కువగానే చేరాయని వినికిడి. దీన్ని ధ్రువపరిచే నిజం సోమవారం బయటపడింది. ఈ సెగ్మెంట్‌లో డబ్బు పంపిణీ మొదలయ్యింది. ఈ విషయం మీడియా కెమెరాలకు చిక్కింది. […]

Advertisement
Update:2015-11-09 17:54 IST

వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అప్పుడే ధన ప్రవాహం మొదలయ్యింది. ఈ సెగ్మెంట్‌కు నోటిఫికేషన్‌ వెలువడగానే డబ్బుల సరఫరా జరగడం… వివిధ చెక్‌పోస్టుల్లో ఇప్పటికే 25 లక్షల రూపాయల వరకు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది నిఘాలో బయటపడిన మొత్తం. ఇది కాకుండా ఇప్పటికే నియోజకవర్గానికి నిధులు ఎక్కువగానే చేరాయని వినికిడి. దీన్ని ధ్రువపరిచే నిజం సోమవారం బయటపడింది. ఈ సెగ్మెంట్‌లో డబ్బు పంపిణీ మొదలయ్యింది. ఈ విషయం మీడియా కెమెరాలకు చిక్కింది. పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌లో డబ్బులు పంచుతూ కొంతమంది కెమెరాలకు చిక్కారు. అయితే ఈ డబ్బు పంపీణీ చేసింది తెలుగుదేశం-బీజేపీ కూటమి సభ్యులని అధికారపక్షం చెబుతుండగా, కాంగ్రెస్‌ సభ్యులని మరికొందరు, కాదు అధికార టీఆర్‌ఎస్‌ సభ్యులకే ఆ అవకాశం ఉందని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారన్నది ఇంకా వెల్లడి కాలేదు. పార్టీ జెండాలుగాని, ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తులుగాని సంఘటన స్థలిలో లేకపోవడంతో ఈ సొమ్ము ఎవరు పంచుతున్నారన్నది బయటపడలేదు.

Tags:    
Advertisement

Similar News