ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ ఓటమి ఖాయం!

బీహార్‌లో ఘోర ఓటమితో కంగుతిన్న కమలనాథులు ఇప్పుడు 2016ను తలచుకుని వణికిపోతున్నారు. ముఖ్యంగా మోదీ టీం షేక్ అయిపోతోంది. కమలనాథుల భయానికి కారణం వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడమే. ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీకి ఓటమి ఖాయమన్నది వారి భావన. ఎందుకంటే 2011లో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ కనీస స్థాయిలో కూడా ఓటు , సీట్లు సాధించలేకపోయింది. వచ్చే ఏడాది […]

Advertisement
Update:2015-11-09 06:05 IST

బీహార్‌లో ఘోర ఓటమితో కంగుతిన్న కమలనాథులు ఇప్పుడు 2016ను తలచుకుని వణికిపోతున్నారు. ముఖ్యంగా మోదీ టీం షేక్ అయిపోతోంది. కమలనాథుల భయానికి కారణం వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడమే. ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీకి ఓటమి ఖాయమన్నది వారి భావన. ఎందుకంటే 2011లో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ కనీస స్థాయిలో కూడా ఓటు , సీట్లు సాధించలేకపోయింది.

వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. 2011లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడు, కేరళ, బెంగాల్,,పుదిచ్చేరిలో బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అసోంలో మాత్రం 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 2011 ఎన్నికల్లో తమిళనాడులో 125 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క చోట కూడా గెలుపు తీరం చేరలేకపోయింది. కేరళలో 140 స్థానాల్లో పోటీ చేయగా అక్కడ కూడా సున్నాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బెంగాల్‌లో 108 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కచోట కూడా కమలం గెలుపు సువాసనను వెదజల్లలేకపోయింది.

అప్పటికి ఇప్పటికి కూడా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. తమిళనాడులో పోటీ జయ, కరుణ పార్టీల మధ్యే ఉంటుంది. అక్కడ మూడో వ్యక్తికి, ముఖ్యంగా తమిళనాడేతర పార్టీలకు అస్సలు ఓట్లు పడవు. బెంగాల్‌లో పోటీ తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం మధ్య ముఖాముఖీగా ఉంటుంది. కేరళ, అసోంలోనూ బీజేపీ బలం నామమాత్రమే. కాబట్టి మరో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటమికి ఇప్పటి నుంచే మానసికంగా బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News