మహిళలపై సుజనా వివాదాస్పద వ్యాఖ్యలు

విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించి టీడీపీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని చెప్పారు. వారిపై స్టాంప్ వేసి కూర్చోబెట్టడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అంతా తామే చేస్తామని మహిళలు చెప్పడం సరికాదన్నారు. అంతేకాదు మహిళా పారిశ్రామికవేత్తలు ఆరంభ శూరత్వాన్ని వదలిపెట్టాలని హితవు పలికారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఇన్‌స్టంట్ కాఫీ తరహాలో కాకుండా ఫిల్టర్ కాఫీ […]

Advertisement
Update:2015-11-08 02:58 IST

విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించి టీడీపీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని చెప్పారు. వారిపై స్టాంప్ వేసి కూర్చోబెట్టడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అంతా తామే చేస్తామని మహిళలు చెప్పడం సరికాదన్నారు. అంతేకాదు మహిళా పారిశ్రామికవేత్తలు ఆరంభ శూరత్వాన్ని వదలిపెట్టాలని హితవు పలికారు.

మహిళా పారిశ్రామికవేత్తలు ఇన్‌స్టంట్ కాఫీ తరహాలో కాకుండా ఫిల్టర్ కాఫీ తరహాలో పనులు సాధించుకోవాలని సూచన చేశారు. అయితే సుజనా చౌదరిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉంటూ వ్యక్తిగత అభిప్రాయం పేరుతో మహిళల రిజర్వేషన్లను ఎలా వ్యతిరేకిస్తారని మండిపడుతున్నారు. మహిళలది ఆరంభ శూరత్వం అన్నట్టు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News