కూతురి కోసం ప్రియాంక సాహసం
సోనియా కూతురు ప్రియాంక గాంధీ తన కూతురి కోసం భద్రతా వలయాన్ని విడిచి సుధీర్ఘ ప్రయాణం చేశారు. సెక్యూరిటీకి కూడా చెప్పకుండా 150 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రియాంక కూతురు మిరాయా వాద్రా … హర్యానా జీంద్ పట్టణం సమీపానంలోని తక్షశిల ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కట్‌బాల్ పోటీల్లో పాల్గొంది. కూతురు ఆటను చూసేందుకు ప్రియాంక ఏకంగా ఢిల్లీ నుంచి ఎలాంటి భద్రత లేకుండా 150 కిలోమీటర్లు ప్రయాణించి స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు కూతురు మిరయా ఆటను వీక్షించారు. అది […]
సోనియా కూతురు ప్రియాంక గాంధీ తన కూతురి కోసం భద్రతా వలయాన్ని విడిచి సుధీర్ఘ ప్రయాణం చేశారు. సెక్యూరిటీకి కూడా చెప్పకుండా 150 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రియాంక కూతురు మిరాయా వాద్రా … హర్యానా జీంద్ పట్టణం సమీపానంలోని తక్షశిల ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కట్‌బాల్ పోటీల్లో పాల్గొంది. కూతురు ఆటను చూసేందుకు ప్రియాంక ఏకంగా ఢిల్లీ నుంచి ఎలాంటి భద్రత లేకుండా 150 కిలోమీటర్లు ప్రయాణించి స్కూల్ దగ్గరకు చేరుకున్నారు.
దాదాపు 40 నిమిషాల పాటు కూతురు మిరయా ఆటను వీక్షించారు. అది కూడా వీఐపీలా కాకుండా గేటు దగ్గర నిలబడి ఆటను చూశారు. ఆ సమయంలో తనను ఎవరూ గుర్తుపట్టకుండా ప్రియాంక జాగ్రత్తపడ్డారు. క్రీడా పోటీలు ముగిసిన తర్వాత ప్రియాంక తిరిగి వెళ్తున్న సమయంలో స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఆమెను గుర్తు పట్టారు. ప్రియాంక తక్షశిల ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లిన విషయం భద్రతా సిబ్బంది గుర్తుపట్టలేకపోయారు. స్థానిక కాంగ్రెస్ లీడర్లకు కూడా సమాచారం లేదు. భద్రతా పరంగా ముప్పు ఉన్న గాంధీ కుటుంబసభ్యురాలు ఇలా ఒంటిరిగా బయటకు వెళ్లడం సరైంది కాదని సెక్యూరిటీ ఆఫీసర్స్ అభిప్రాయపడుతున్నారు.