మకాం మార్చడం ఒప్పందంలో భాగమేనా?
రాష్ట్రం విడిపోయాక… హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ర్టాలకు కామన్ క్యాపిటల్ గా విభజన చట్టం అంగీకరించాక, రెండు రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక చంద్రబాబునాయుడు హైదరాబాదులో ప్రెస్ మీట్లు పెట్టి హైదరాబాద్ లో పదేళ్లు మాకు అధికారం ఉంది.. అవసరమైతే మరో ఐదేళ్లు కూడా పెంచుకుంటాం అంటూ గర్జించారు. ఏపీ సెక్రటేరియెట్ లోని ఎల్ బ్లాకును పదికోట్లకు పైగా ఖర్చు పెట్టి బ్యూటిఫికేషన్ చేయించుకున్నారు. గత దసరా రోజున అందులో అడుగుపెట్టి, ఆ రోజు కూడా పదేళ్లు ఇదే […]
Advertisement
రాష్ట్రం విడిపోయాక… హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ర్టాలకు కామన్ క్యాపిటల్ గా విభజన చట్టం అంగీకరించాక, రెండు రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక చంద్రబాబునాయుడు హైదరాబాదులో ప్రెస్ మీట్లు పెట్టి హైదరాబాద్ లో పదేళ్లు మాకు అధికారం ఉంది.. అవసరమైతే మరో ఐదేళ్లు కూడా పెంచుకుంటాం అంటూ గర్జించారు. ఏపీ సెక్రటేరియెట్ లోని ఎల్ బ్లాకును పదికోట్లకు పైగా ఖర్చు పెట్టి బ్యూటిఫికేషన్ చేయించుకున్నారు. గత దసరా రోజున అందులో అడుగుపెట్టి, ఆ రోజు కూడా పదేళ్లు ఇదే గడ్డపై కూర్చుని పాలిస్తాం… అసలు ఈ హైదరాబాద్ ను సృష్టించింది, అభివృద్ధి చేసిందే నేను…అన్నారు. హైదరాబాదులో ఆంధ్రులకు రక్షణ లేకుండాపోయిందని, సెక్షన్ 8ని వెంటనే అమలు చేయాలని ఆ మధ్య ఢిల్లీకి వెళ్లి మరీ చెప్పొచ్చారు బాబు.. కానీ సరిగ్గా నెలన్నర క్రితం ఢిల్లీకి వెళ్లివచ్చాక… ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఓటుకు నోటు కేసులో మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ అన్న టేపులు బయటకొచ్చాక బాబు వైఖరిలో మార్పొచ్చింది. మకాం రాత్రికి రాత్రి బెజవాడకు మార్చారు. మొదట వారంలో మూడు రోజులు అన్నారు.. తరువాత దాన్ని ఏడు రోజులు చేశారు. మింగడానికి మెతుకు లేదు..మీసాలకు సంపెంగ నూనె అన్న సామెతలాగా దూరుకోవడానికి గూడు లేదు… పనిచేయడానికి గుడిసె లేదుకానీ ఉద్యోగులందరూ జూన్ లోపు విజయవాడకు రావాలని ఇప్పుడు హుకూం జారీ చేశారు. ఇప్పుడు ఏపీ సెక్రటేరియెట్ ఉద్యోగుల్లో ఒకటే చర్చ…. గత దసరాకు ముహూర్తం చూసుకుని మరీ ఎల్ బ్లాకులో అడుగుపెట్టిన చంద్రబాబు… పదేళ్లు ఇక్కడే ఉండి పాలిస్తాం… ఎవరికీ భయపడేది లేదు.. అవసరమైతే హైదరాబాదులో ఆంధ్రులకు ప్రత్యేక పోలీసుస్టేషన్లు పెడతాం అన్న మనిషి… రెండో దసరాకు కనీసం సెక్రటేరియెట్ లో కాదుకదా… హైదరాబాదులో కూడా లేకుండాపోయాడెందుకబ్బా అని గుసగుసలాడుకుంటున్నారు. ఎంతో ముందు చూపున్న నాయకుడిగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఏ ముందు చూపూ లేకుండానే పదేళ్లు ఇక్కడే ఉంటామని చెప్పారా అని కొందరు… ఓటుకు నోటు కేసులో కేంద్రం వద్ద రాజీ ఒప్పందంలో భాగంగా చంద్రబాబుకు హైదరాబాద్ బహిష్కరణ జరిగిందని మరికొందరు, గత ఎన్నికల సమయంలో టిడిపికి కోట్ల రూపాయలు విరాళాల రూపంలో పెట్టుబడులు ఇచ్చినవారు… అమరావతి పరిసరాల్లో కొన్న వారి భూములను అర్జెంటుగా అమ్ముకోవడానికి బాబుపై తెచ్చిన ఒత్తిడి తట్టుకోలేక బెజవాడ బాటపట్టారని మరికొందరు … ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ వారితోనైనా సర్దుకుపోవచ్చు కానీ..ఆ బెజవాడ బ్యాచును భరించడం ఎలా అన్న ఆందోళనతో ఈ మధ్యే చాలామంది ఉద్యోగులకు షుగర్లు, బీపీలు కూడా మొదలయ్యాయట.
Advertisement