రాజన్ వారి పేర్లు చెప్పేశాడా?
చోటా రాజన్ ఢిల్లీకి చేరుకోగానే.. అతన్ని సీబీఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయం మహారాష్ట్ర పోలీసులు డీలా పడిపోతున్నారు. ఆ నిరుత్సాహం రాజన్ ని విచారించే అవకాశం జారిపోయినందుకు కాదు. సీబీఐ ఇప్పుడు ఇంటి దొంగలపై దృష్టి సారించింది. ఇప్పటికే పోలీసు శాఖలో దావూద్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు చోటారాజన్ వెల్లడించాడట. దేశంలో ఉన్న పోలీసు అధికారుల్లో కొందరు దావూద్ అనుకూలంగా వ్యవహరిస్తారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. అందుకే, చాలాసార్లు […]
Advertisement
చోటా రాజన్ ఢిల్లీకి చేరుకోగానే.. అతన్ని సీబీఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయం మహారాష్ట్ర పోలీసులు డీలా పడిపోతున్నారు. ఆ నిరుత్సాహం రాజన్ ని విచారించే అవకాశం జారిపోయినందుకు కాదు. సీబీఐ ఇప్పుడు ఇంటి దొంగలపై దృష్టి సారించింది. ఇప్పటికే పోలీసు శాఖలో దావూద్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు చోటారాజన్ వెల్లడించాడట. దేశంలో ఉన్న పోలీసు అధికారుల్లో కొందరు దావూద్ అనుకూలంగా వ్యవహరిస్తారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. అందుకే, చాలాసార్లు పోలీసులు దాడులు చేసే సమాచారాలు దావూద్ మనుషులకు ముందుగానే చేరాయన్న విమర్శలు ఉన్నాయి.
వారు ఎవరు?
చోటారాజన్ లొంగుబాటు వ్యూహాత్మకమా? లేక కాకతాళీయమా? అన్న విషయాలు పక్కనబెడితే దావూద్ ముఠా ఆనుపానులు అతనికి పూర్తిగా తెలుసన్న విషయం పలువురిలో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ రెండు గ్యాంగులు పరస్పరం ఒకరి కార్యకలాపాలపై మరొకరు నిఘా పెట్టుకుంటాయన్న విషయం తెలిసిందే. చాలాకాలంగా ఇండియాలో దావూద్ నెట్‌వర్క్ ని సమూలంగా నాశనం చేయాలని చూస్తోన్న భారత నిఘావర్గాలకు రాజన్ అరెస్టు చక్కటి అవకాశంగా మారింది. మహా వృక్షంగా విస్తరించిన దావూద్ నేరసామ్రాజ్య పతనం ఇక మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు పోలీసుశాఖపై సీబీఐ దృష్టి పెట్టినట్లు సమాచారం.
పోలీసులు సహకరించారా?
మహారాష్ట్రలో మాఫియాను అంతమొందించడానికి తీసుకువచ్చిన చట్టం మోకా. ఈ చట్టం అమలయ్యాక చాలామంది గ్యాంగ్‌స్టర్లు పోలీసుల ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఇక్కడే దావూద్ తన తెలివిని వాడాడు. తన ప్రత్యర్థుల సమాచారం పోలీసులకు తెలిసేలా చేసి వారిని మాత్రమే.. ఎన్‌కౌంటర్ చేసేలా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే మహరాష్ట్ర పోలీసులు జరిపిన కాల్పుల్లో దావూద్ వ్యతిరేక ముఠా సభ్యులే ఎక్కువగా చనిపోయారన్న వాదనలు ఉన్నాయి. దావూద్ కు అనుకూలంగా వ్యవహరించడమంటే కేవలం లంచమే తీసుకోనక్కర్లేదు. చట్టపరిధిలోనే ఉంటూ దావూద్ వ్యతిరేక ముఠాను అంతమొందించినా.. అది అతనికి అనుకూలంగా వ్యవహరించినట్లే కదా! అందుకే ఇప్పడు కొందరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.
Advertisement