ఢిల్లీలో... నో దీపావ‌ళి

వాతావ‌ర‌ణ కాలుష్యం విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌మాద‌క‌ర‌మైన స్థితిలో ఉన్న ఢిల్లీ…దీపావ‌ళి అనంత‌రం మ‌రింత పొగతో, వాయు కాలుష్యాల‌తో నిండిపోతుంద‌ని అక్క‌డి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది. అందుకే ఈ సారి దీపావ‌ళిని నో ఫైర్ క్రాక‌ర్స్ డేగా జ‌రుపుకోవాల‌ని తీర్మానించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నుండి ప్ర‌చారం మొద‌లైంది. ముఖ్యంగా దీపావ‌ళి అంటే పూర్తిగా పిల్ల‌ల పండుగ క‌నుక ఈ విష‌యంలో పిల్ల‌ల‌ను ఒప్పించే ప్ర‌య‌త్నాలను ప్ర‌భుత్వం  చేస్తోంది. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా స్వ‌యంగా ఈ […]

Advertisement
Update:2015-11-06 07:44 IST

వాతావ‌ర‌ణ కాలుష్యం విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌మాద‌క‌ర‌మైన స్థితిలో ఉన్న ఢిల్లీ…దీపావ‌ళి అనంత‌రం మ‌రింత పొగతో, వాయు కాలుష్యాల‌తో నిండిపోతుంద‌ని అక్క‌డి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది. అందుకే ఈ సారి దీపావ‌ళిని నో ఫైర్ క్రాక‌ర్స్ డేగా జ‌రుపుకోవాల‌ని తీర్మానించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నుండి ప్ర‌చారం మొద‌లైంది. ముఖ్యంగా దీపావ‌ళి అంటే పూర్తిగా పిల్ల‌ల పండుగ క‌నుక ఈ విష‌యంలో పిల్ల‌ల‌ను ఒప్పించే ప్ర‌య‌త్నాలను ప్ర‌భుత్వం చేస్తోంది. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా స్వ‌యంగా ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని త‌న భుజాల‌పై వేసుకున్నారు. దాదాపు 2 వేల‌మంది విద్యాసంస్థ‌ల ప్రిన్స్‌పాల్స్‌కు మ‌నీష్ సిసోడియా కార్యాల‌యం నుండి లేఖ‌లు వెళ్లాయి. ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు స్కూళ్ల‌తో పాటు ఢిల్లీ యూనివ‌ర్శిటీ కాలేజీల‌కు సైతం సిసోడియా లేఖ‌లు రాశారు. ఢిల్లీలో వాయు, శ‌బ్ద కాలుష్యాల‌ను నియంత్రించాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం క్రాక‌ర్స్ కాల్చ‌వ‌ద్ద‌నే ప్ర‌చారం చేస్తోంద‌ని, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగ‌స్వాములైన వారంతా ఇందులో పాలు పంచుకుంటున్నార‌ని, మీరు కూడా స‌హ‌క‌రించాల‌ని సిసోడియా ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ ప్ర‌చారంలో పిల్ల‌ల‌ను అత్య‌ధికంగా పాల్గొనేలా చేయాల‌ని, స్కూళ్లు, కాలేజీల‌ త‌ర‌పున ఈ విష‌యంపై వీధి నాట‌కాలు, పాద‌యాత్ర‌లు, సెమినార్లు, వ‌ర్క్‌షాపులు నిర్వ‌హించాల‌ని సూచించారు.

పిల్ల‌లు తాము యాంటీ ఫైర్ క్రాక‌ర్స్‌కి క‌ట్టుబ‌డి ఉండ‌టంతో పాటు త‌మ ఇరుగుపొరుగు వ‌ర‌కు ఈ ప్ర‌చారాన్ని తీసుకువెళ్లేలా వారిని మోటివేట్ చేయాల‌ని సిసోడియా లేఖ‌లో ప్రిన్స్‌పాల్స్‌ని కోరారు. ప్రిన్స్‌పాల్స్‌ స‌హ‌కారం ఉంటే ఇది త‌ప్ప‌కుండా సాధ్య‌మ‌వుతుంద‌ని, దీంతో దీపావ‌ళి నాడు ఢిల్లీలో కాలుష్యాన్ని కొంత‌మేర‌క‌యినా త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఆయన ఆ లేఖ‌లో పేర్కొన్నారు. సో…ఈసారి ఢిల్లీకి వెలుగుల దీపావ‌ళి కాకుండా స్వ‌చ్ఛ దీపావ‌ళి రానున్న‌ద‌న్న‌మాట‌.

Tags:    
Advertisement

Similar News