తవ్వుకున్న సీమ గోతిలో చంద్రబాబు

ఈనెల 21న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో  ఈ పరిణామంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్రం విడిపోయిన 16 నెలల్లోనే మరో ఉద్యమం రావడానికి కారణాలేంటని, తప్పు ఎక్కడ జరిగిందన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఆఫ్ ది రికార్డులో నేతలంతా ఒక విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నారు. చంద్రబాబు చేసిన పొరపాటు వల్లే అనతికాలంలోనే ఊహించని విపరీత పరిణామం ఎదురైందని లోలోన అంగీకరిస్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమకే […]

Advertisement
Update:2015-11-06 05:23 IST

ఈనెల 21న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్రం విడిపోయిన 16 నెలల్లోనే మరో ఉద్యమం రావడానికి కారణాలేంటని, తప్పు ఎక్కడ జరిగిందన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఆఫ్ ది రికార్డులో నేతలంతా ఒక విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నారు. చంద్రబాబు చేసిన పొరపాటు వల్లే అనతికాలంలోనే ఊహించని విపరీత పరిణామం ఎదురైందని లోలోన అంగీకరిస్తున్నారు.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమకే రాజధాని దక్కాలని ఆ ప్రాంత నేతలు డిమాండ్ చేశారు. అయితే జగన్‌ భుజం మీద తుపాకీ పెట్టి సీమకు హ్యాండిచ్చారు చంద్రబాబు. తాము క‌ృష్ణా , గుంటూరుజిల్లా మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని… అందుకు జగన్ అంగీకరిస్తారో లేదో చెప్పాలని చంద్రబాబు పదేపదే నిలదీశారు.. ఒక వేళ జగన్ ప్రస్తుత రాజధాని ప్రాంతాన్ని వ్యతిరేకిస్తే కోస్తా ప్రాంతానికి జగన్ వ్యతిరేకి అన్న ముద్ర వేయడం ద్వారా వైసీపీని రాయలసీమకే పరిమితం చేయవచ్చని చంద్రబాబు భావించారు. కానీ జగన్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో చంద్రబాబు సమర్థవంతంగా తనకు ఇష్టమైన ప్రాంతంలోనే రాజధాని నిర్మాణానికి సిద్దమయ్యారు. ఇక్కడే రాయలసీమ ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు.

అంతటితో ఆగని చంద్రబాబు ప్రభుత్వం తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్‌లో స్థానికతను ఎత్తివేసి పబ్లిక్‌గానే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారన్న భావన ఉంది. పద్మావతి మెడికల్ కాలేజ్‌ను 13 జిల్లాలకు లోకల్ చేయడంతో 150 సీట్లలో సీమ విద్యార్థులకు కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరొస్తాయని చెప్పిన చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమలు చివరకు హంద్రీనీవా మోటర్లనే తీసుకెళ్లి పట్టిసీమకు బిగించారు. దీంతో రాయలసీమ పట్ల ప్రభుత్వ ఆలోచనాధోరణి ఎలా ఉందో స్పష్టంగా అర్థమైపోయింది.

ఇలా లేనిపోయి వివాదాలను చంద్రబాబే సృష్టించి విభజనబీజాలు నాటారని సీమనేతలు విమర్శిస్తున్నారు. అయితే ఈ తప్పులన్నీ జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు కావాలనే చేశారని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై జగన్ గళమెత్తితే తన అనుకూల మీడియా ద్వారా జగన్ కోస్తా ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకి అన్న ముద్రవేయించాలని చంద్రబాబు ఎత్తువేశారంటున్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టబోయి చంద్రబాబే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమ రాష్ట్ర సాధన సమితి.. మైసూరారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడుతున్నప్పటికీ ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా సమితి స్థాపన వెనుక జగన్ హస్తం ఉందన్న ప్రచారం మొదలుపెట్టడాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.

Also Read: వారసులకు లైన్ క్లియర్ చేస్తున్న జేసీ బ్రదర్స్

Tags:    
Advertisement

Similar News