వైసీపీకి రాజీనామా యోచనలో మైసూరారెడ్డి?
రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు రాబోతోంది. తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని భావిస్తున్న రాయలసీమ మేధావులు, నేతలు, రచయితలు ఏకమవుతున్నారు. ఈనెల 21న తిరుపతిలో వీరంతా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలోనే రాయలసీమ ఉద్యమ జేఏసీ ఏర్పాటు కాబోతోంది. ఈ జేఏసీకి సీనియర్ రాజకీయనాయకులు మైసూరారెడ్డి కన్వీనర్‌గా ఉండబోతున్నారని సమాచారం. ఇందుకోసం ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో రాయలసీమ ఉద్యమ జేఏసీకి నాయకత్వం వహిస్తారని సమాచారం. […]
రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు రాబోతోంది. తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని భావిస్తున్న రాయలసీమ మేధావులు, నేతలు, రచయితలు ఏకమవుతున్నారు. ఈనెల 21న తిరుపతిలో వీరంతా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలోనే రాయలసీమ ఉద్యమ జేఏసీ ఏర్పాటు కాబోతోంది. ఈ జేఏసీకి సీనియర్ రాజకీయనాయకులు మైసూరారెడ్డి కన్వీనర్‌గా ఉండబోతున్నారని సమాచారం. ఇందుకోసం ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో రాయలసీమ ఉద్యమ జేఏసీకి నాయకత్వం వహిస్తారని సమాచారం. మైసూరరెడ్డి రాజీనామాపై కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
21న జరిగే సమావేశానికి రాయలసీమకు చెందిన అన్ని పార్టీల నేతలు, మేధావులు, విశ్రాంత న్యాయమూర్తులు హాజరుకానున్నారని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ చెప్పారు. గడిచిన 16 నెలల కాలంలో రాయలసీమకు జరగకూడని స్థాయిలో అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. రాజధాని, హైకోర్టు అన్ని కోల్పోయామన్నారు . పట్టీసీమ పేరుతో సీమ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈనెల21న తిరుపతిలో జరిగే సమావేశంలో రాయలసీమ ఉద్యమ జేఏసీకి సంబంధించి ఒక బాడీని కూడా ప్రకటిస్తామన్నారు.