సుప్రీం తదుపరి సీజేగా టీఎస్ ఠాకూర్

భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా టీఎస్ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ దత్తు డిసెంబర్‌ 2న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ …. టీఎస్ ఠాకూర్ చేత భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు.  1952 జనవరి 4న జన్మించిన ఠాకూర్  ప్లీడర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో జమ్ముకశ్మీర్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  న్యాయమూర్తిగా కర్నాటక, ఢిల్లీ హైకోర్టుల్లో పనిచేశారు. […]

Advertisement
Update:2015-11-04 11:37 IST

భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా టీఎస్ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ దత్తు డిసెంబర్‌ 2న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ …. టీఎస్ ఠాకూర్ చేత భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. 1952 జనవరి 4న జన్మించిన ఠాకూర్ ప్లీడర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో జమ్ముకశ్మీర్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయమూర్తిగా కర్నాటక, ఢిల్లీ హైకోర్టుల్లో పనిచేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగానూ ఠాకూర్ సేవలందించారు. 2009లో సుప్రీం కోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Tags:    
Advertisement

Similar News