ఈసారి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తెలుగు సినిమాకు చోటు లేదు
ఈనెల 20వ తేదీనుండి గోవాలో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇండియన్ పనోరమాకి 26 చిత్రాలను ఎంపికచేశారు. ప్రముఖ చిత్రనిర్మాత అభిరాం శ్యాం శర్మ చైర్మన్‌గా మొత్తం 13 మంది సభ్యులు దరిదాపు 27 రోజులపాటు 230 చిత్రాలను చూసి 26 చిత్రాలను ఎంపికచేశారు. సంస్కృతచిత్రం, ప్రియమానసంను ఓపెనింగ్ చిత్రంగా నిర్ణయించారు. తమిళం, కన్నడం, కొంకిణి, సంస్కృతం, బోడో, వాంచూ భాషలనుండి ఒక్కోచిత్రం ఎన్నిక కాగా, హిందీ నుండి ఐదు, మళయాళం నుండి నాలుగు, మరాఠీనుండి నాలుగు, బెంగాలీనుండి […]
ఈనెల 20వ తేదీనుండి గోవాలో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇండియన్ పనోరమాకి 26 చిత్రాలను ఎంపికచేశారు. ప్రముఖ చిత్రనిర్మాత అభిరాం శ్యాం శర్మ చైర్మన్‌గా మొత్తం 13 మంది సభ్యులు దరిదాపు 27 రోజులపాటు 230 చిత్రాలను చూసి 26 చిత్రాలను ఎంపికచేశారు. సంస్కృతచిత్రం, ప్రియమానసంను ఓపెనింగ్ చిత్రంగా నిర్ణయించారు. తమిళం, కన్నడం, కొంకిణి, సంస్కృతం, బోడో, వాంచూ భాషలనుండి ఒక్కోచిత్రం ఎన్నిక కాగా, హిందీ నుండి ఐదు, మళయాళం నుండి నాలుగు, మరాఠీనుండి నాలుగు, బెంగాలీనుండి మొత్తం ఏకంగా ఏడు చిత్రాలు ఎన్నికయ్యాయి. తెలుగులో ఒక్కచిత్రంకూడా లేకపోవడం గొప్ప విశేషం. మన తెలుగుచలన చిత్రసీమ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం.
ప్రియమానసం ప్రపంచంలో నిర్మించిన మూడవ సంస్కృత చిత్రం. ఈ సినిమాకు డిసెంబర్ 4 నుండి త్రివేండ్రంలో జరగబోయే 20వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించకుండా నిషేధించడం మరొక విశేషం.
నాన్-ఫీచర్ చిత్రాల కింద మొత్తం 146 ఎంట్రీలు రాగా 7 మెంబర్లు గల కమిటీ ప్రముఖ చిత్రనిర్మాత రాజేంద్ర జాంగ్లే చైర్మన్‌గా 13 రోజులపాటు చూసి 21 చిత్రాలను ఎంపిక చేశారు. హిందీ చిత్రం గూంగ పెహల్‌వాన్‌నే ప్రారంభచిత్రంగా నిర్ణయించారు.