తమిళ ఉద్యోగులకు జయ వరాలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏం చేసినా సంచలనమే. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న జయ.. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులందరికీ తీపి కబురు చెప్పారు. మొత్తం 3 లక్షల 76 వేల 464 మందికి బోనస్‌ విడుదల చేశారు. అందుకోసం 242 కోట్ల 41 లక్షల రూపాయలను మంజూరు చేసినట్టు సచివాలయం ప్రకటించింది. తమిళనాడు విద్యుత్‌, ప్రభుత్వ రవాణా సంస్థలు, పౌరసరఫరాల శాఖ, ప్రభుత్వ రబ్బరు సంస్థ, ఉద్యానవన […]

Advertisement
Update:2015-11-02 15:13 IST

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏం చేసినా సంచలనమే. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న జయ.. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులందరికీ తీపి కబురు చెప్పారు. మొత్తం 3 లక్షల 76 వేల 464 మందికి బోనస్‌ విడుదల చేశారు. అందుకోసం 242 కోట్ల 41 లక్షల రూపాయలను మంజూరు చేసినట్టు సచివాలయం ప్రకటించింది. తమిళనాడు విద్యుత్‌, ప్రభుత్వ రవాణా సంస్థలు, పౌరసరఫరాల శాఖ, ప్రభుత్వ రబ్బరు సంస్థ, ఉద్యానవన శాఖ, తేయాకు బోర్డు, సహకార, చక్కెర కర్మాగారాలు, సహకార పాల ఉత్పత్తిదారుల సంస్థలలో అర్హులైన కార్మికులకు 20 శాతం బోనస్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు.
అంతేకాకుండా వాణిజ్యపన్నుల శాఖలో పనిచేసే కార్మికులకు గతంలో ఇచ్చిన 8.33 శాతం బోనస్‌తో పాటు 1.67శాతం కరువు భత్యం చేర్చి అదనంగా 10 శాతం బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఇక లాభాల్లో ఉన్న సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులకు తమిళనాడు హౌసింగ్‌బోర్డు, చెన్నై మెట్రోవాటర్‌బోర్డు, సీవరేజ్‌ బోర్డులలో పనిచేస్తున్న సీ, డీ విభాగాలకు చెందిన కార్మికులకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు. మొత్తం మీద దీపావళి నాడు తమిళనాడు ఉద్యోగులు నిజమైన పండుగ చేసుకోబోతున్నారన్నమాట.

Tags:    
Advertisement

Similar News