చిక్కుల్లో జయలలిత ఇష్టసఖి శశికళ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల శశికళ వదిన ఇళవరసి చెన్నై శివారు వేలాచ్చేరిలో 1000 కోట్ల రూపాయలతో లక్స్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ను కొనుగోలు చేశారు. ఇందులో  11 సినిమా స్క్రీన్ లతోపాటు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కాంప్లెక్స్ నిర్మించారు. ఈ కొనుగోలు విషయాన్ని తమిళనాడు కార్పొరేట్ వ్యవహారాలశాఖ వెబ్సైట్లో పెట్టడంతో రాజకీయంగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఇది సీఎం జయలలితకు కూడా రాజకీయంగా పెద్ద  చిక్కులు తెచ్చిపెడుతోంది. అసలు శశికళ వదినకు […]

Advertisement
Update:2015-11-01 06:29 IST

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల శశికళ వదిన ఇళవరసి చెన్నై శివారు వేలాచ్చేరిలో 1000 కోట్ల రూపాయలతో లక్స్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ను కొనుగోలు చేశారు. ఇందులో 11 సినిమా స్క్రీన్ లతోపాటు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కాంప్లెక్స్ నిర్మించారు.
ఈ కొనుగోలు విషయాన్ని తమిళనాడు కార్పొరేట్ వ్యవహారాలశాఖ వెబ్సైట్లో పెట్టడంతో రాజకీయంగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఇది సీఎం జయలలితకు కూడా రాజకీయంగా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది. అసలు శశికళ వదినకు వెయ్యి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్నది తేల్చాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదంతా సిఎం జయలలిత బినామీ పేర్లతో కొన్న ఆస్తులేనని ఆరోపిస్తున్నాయి.
శశికల కుటుంబ సభ్యులు ఆదాయపు పన్ను చెల్లించలేని పరిస్థితుల్లో కేసులు నడిచాయి. చివరకు 1991-92, 1992-93 ఏడాదికి చెందిన ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన కేసులో రెండు కోట్ల రూపాయలు గత ఏడాదే చెల్లించారు. అలాంటిది శశికళ, ఆమె వదిన ఇంతలోనే 1000కోట్ల రూపాయలతో కాంప్లెక్స్ ఎలా కొంటారని డీఎంకే ప్రశ్నిస్తోంది. ఈ వివాదం అన్నాడీఎంకే పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంపై జయలలిత ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News