2008లోనే దావూద్‌కు స్పాట్
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను మట్టుబెట్టేందుకు భారత నిఘా సంస్థ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఆధ్వర్యంలో 2008లోనే ముహూర్తం పెట్టింది. కానీ అనుకోని కారణాల వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇందుకోసం దావూద్ బద్ధ శత్రువు మాఫియాడాన్ చోటారాజన్‌తో ఐబీ అప్పట్లోనే ఓ ఆపరేషన్ ప్లాన్ చేసింది. చోటా రాజన్ అరెస్టుతో లోకానికి తెలియని ఈ విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ కుమార్ దోవాల్ నేతృత్వంలోనే ఈ ప్లాన్ […]
Advertisement
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను మట్టుబెట్టేందుకు భారత నిఘా సంస్థ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఆధ్వర్యంలో 2008లోనే ముహూర్తం పెట్టింది. కానీ అనుకోని కారణాల వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇందుకోసం దావూద్ బద్ధ శత్రువు మాఫియాడాన్ చోటారాజన్‌తో ఐబీ అప్పట్లోనే ఓ ఆపరేషన్ ప్లాన్ చేసింది. చోటా రాజన్ అరెస్టుతో లోకానికి తెలియని ఈ విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ కుమార్ దోవాల్ నేతృత్వంలోనే ఈ ప్లాన్ జరిగిందని సమాచారం. 2004-05 మధ్య కాలంలో ధోవల్ ఐబీకి డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. తరువాత కొంతకాలం ఐబీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. 2008లో చోటారాజన్ ముఠాకు చెందిన షార్ప్ షూటర్ విక్కీమల్హోత్రాను భారత్ నుంచి దుబాయ్‌కి పంపి అక్కడ దావూద్ కాల్చి చంపాలని ధోవల్ స్కెచ్ వేశారు.
ప్లానేంటి?
2008లోనే దావూద్ కుమార్తె వివాహం క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారుడితో దుబాయ్‌లోని హోటల్ హయత్‌లో జరిగింది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ, దేవాంతకుడైన ధోవాల్ ఈ వేడుక సమాచారం ముందే తెలుసుకున్నారు. చోటా రాజన్ మనుషులను సంప్రదించారు. అంతే.. దావూద్‌ను చంపేందుకు షార్ప్ షూటర్ విక్కీ మల్హోత్రా రెడీ అయ్యాడు. అతనికి తోడుగా ఫరీద్ తనాషా సిద్ధమయ్యాడు. వీరు ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్ విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆఖరు నిమిషంలో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఐబీ సహకారంతో ఈ ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలియక షార్ప్ షూటర్ విక్కీ మల్హోత్రా, అతని అనుచరుడు ఫరీద్ తనాషాను అరెస్టు చేశారు. ఐబీ అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. లేకుంటే.. చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన దావూద్ కూతురు పెళ్లివేడుకలోనే అతడు హతమై ఉండేవాడు.
Advertisement