ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్‌ మట్టి సత్యాగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయాలని డిమాండు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి సత్యాగ్రహానికి పిలుపు ఇచ్చింది.  రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సాధించడం కోసం సత్సంకల్పంతో ఏపీ కాంగ్రెస్‌ కమిటీ చేపట్టిన ఈ మట్టి సత్యాగ్రహం ద్వారా ఆరు కోట్ల మంది తెలుగు ప్రజల మనోవాంఛను ప్రతిబింబింప చేయాలని,  రాష్ట్రంలోని కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని ఏపీ […]

Advertisement
Update:2015-10-29 06:36 IST
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయాలని డిమాండు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి సత్యాగ్రహానికి పిలుపు ఇచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సాధించడం కోసం సత్సంకల్పంతో ఏపీ కాంగ్రెస్‌ కమిటీ చేపట్టిన ఈ మట్టి సత్యాగ్రహం ద్వారా ఆరు కోట్ల మంది తెలుగు ప్రజల మనోవాంఛను ప్రతిబింబింప చేయాలని, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి కోరారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, మండలాధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు తమ తమ ప్రాంతాల్లో మట్టిని సేకరించి ప్రధానమంత్రి నరేంద్రమోడికి పంపాలని కాంగ్రెస్‌ పిలుపు ఇచ్చింది.
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం ద్వారా దేశానికి స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా సాధించారో అదే స్ఫూర్తితో మట్టి సత్యాగ్రహం ద్వారా రాష్ట్ర విభజన చట్టంలోని ప్రతి ఒక్క అంశాన్ని అమలు చేయించుకోవడానికి కాంగ్రెస్‌ చేసే ప్రయత్నంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. నాటి కాంగ్రెస్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయించుకోవడానికి, ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి పరచుకోవడానికి మట్టి సత్యాగ్రహం కార్యక్రమంలో అన్ని వర్గాలవారు భాగస్వాములు కావాలని, తమ తమ ప్రాంతాల్లో పిడికెడు మట్టి, చెరువులు, నదుల నుంచి చెంబుడు నీళ్ళ సేకరించి వాటిని నరేంద్రమోది, భారత ప్రధానమంత్రి, 7, రేస్‌కోర్స్‌ రోడ్డు, న్యూఢిల్లీ-110008 అనే చిరునామాకు పంపించాలని రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు.
Tags:    
Advertisement

Similar News