టీడీపీపై మళ్ళీ కన్నెర్రజేసిన సోము వీర్రాజు

భారతీయ జనతాపార్టీ నాయకుడు సోము వీర్రాజు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులపై ఒంటి కాలిపై లేస్తున్నారు. కారణం ఏమిటో తెలీదు కాని బీజేపీ తరపున తొలి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఆయన ఇటీవల చంద్రబాబుపై, గల్లా జయదేవ్‌పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అదే గళం… తెలంగాణలో కేంద్ర పథకాలకు ప్రధాని మోదీ ఫోటో వాడుతుంటే ఏపీలో చంద్రబాబు ఫోటో మాత్రమే పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీకి కేంద్రం ప్రభుత్వం అనేక రీతుల్లో […]

Advertisement
Update:2015-10-28 14:18 IST

భారతీయ జనతాపార్టీ నాయకుడు సోము వీర్రాజు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులపై ఒంటి కాలిపై లేస్తున్నారు. కారణం ఏమిటో తెలీదు కాని బీజేపీ తరపున తొలి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఆయన ఇటీవల చంద్రబాబుపై, గల్లా జయదేవ్‌పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అదే గళం… తెలంగాణలో కేంద్ర పథకాలకు ప్రధాని మోదీ ఫోటో వాడుతుంటే ఏపీలో చంద్రబాబు ఫోటో మాత్రమే పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీకి కేంద్రం ప్రభుత్వం అనేక రీతుల్లో సాయం చేస్తున్నా టీడీపీ ప్రభుత్వం మాత్రం వాటి గురించి చెప్పడం లేదని వీర్రాజు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ గల్లా జయదేవ్‌లు చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని చాటి చెబుతున్నాయని ఈసారి విమర్శలు గుప్పించారు. ఇంతకుముందు కూడా వీర్రాజు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అంటూ మోదీని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంటూ యాగి చేస్తున్న హీరో శివాజీ, కారెం శివాజీల వెనుక ఎవరున్నారో తమకు తెలుసని చెబుతూనే కారెం శివాజీని ఒక మంత్రి నడిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా మీడియాలో పద్దతి ప్రకారం ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవి కోసమే టీడీపీకి వ్యతిరేకంగా తాను మాట్లాడుతున్నాననడం సరికాదని సోము వీర్రాజు వివరించారు.

Tags:    
Advertisement

Similar News