కాంగ్రెస్+ ఆవు= ఎన్డీఏ: సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
మోదీ ప్రభుత్వ విధానాలపై సొంతపార్టీలోనే ఉరుము ఉరిమింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌శౌరి నేరుగా మోదీపై అటాక్ చేశారు. దేశంలో మోదీని మించిన బలవంతుడు లేడని కమలనాథులు కోడై కూస్తున్న వేళ శౌరి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పుడున్నంత బలహీనంగా చరిత్రలో ఎన్నడూ లేదని తేల్చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుత మోదీ పాలనకు తేడా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ విధానాలకు ఆవు అనే అంశాన్ని జోడిస్తే అదే […]
మోదీ ప్రభుత్వ విధానాలపై సొంతపార్టీలోనే ఉరుము ఉరిమింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌శౌరి నేరుగా మోదీపై అటాక్ చేశారు. దేశంలో మోదీని మించిన బలవంతుడు లేడని కమలనాథులు కోడై కూస్తున్న వేళ శౌరి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పుడున్నంత బలహీనంగా చరిత్రలో ఎన్నడూ లేదని తేల్చేశారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుత మోదీ పాలనకు తేడా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ విధానాలకు ఆవు అనే అంశాన్ని జోడిస్తే అదే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వమని ఎత్తిపొడిచారు. (మోదీ ప్రధాని అయిన తర్వాత నిత్యం గోవు అంశం వివాదం అవుతున్న నేపథ్యలో అరుణ్ శౌరి ఇలా మాట్లాడారు) ఢిల్లీలో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అరుణ్ శౌరి ఈ వ్యాఖ్యలు చేశారు. జనం మోదీ కన్నా మన్మోహన్ సింగే తెలివైన వాడిగా ఇప్పుడు భావిస్తున్నారని చెప్పారు. శౌరి ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మన్మోహన్ సింగ్ కూడా అక్కడే ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ అద్భుతమంటూ నిత్యం హెడ్‌లైన్స్‌లో వస్తే చాలన్నట్టుగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయం దేశంలోని పారిశ్రామికవేత్తలకు అర్థమైందని అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వారు సాహసించడం లేదని చెప్పారు. అరుణ్ శౌరి వ్యాఖ్యలతో బీజేపీ నేతలు ఉలిక్కపడ్డారు. వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టారు. మోదీది బలహీన ప్రభుత్వం కాదని బలమైన ప్రభుత్వమని వెంకయ్యనాయుడు కితాబిచ్చుకున్నారు. మోదీ పాపులారిటీ చూసి ప్రత్యర్తులు అసూయపడుతున్నారంటూ అరుణ్ శౌరిని కూడా ప్రత్యర్థుల జాబితాలో చేర్చారు. ఓడిపోయిన వారి మాటలు, సలహాలు పట్టించుకోవాల్సిన అవరసం లేదని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించారు.