జగన్ రాకతో రైతుకు కొత్త కష్టాలు!
జగన్ పరామర్శ మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఓ రైతుకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఏపీ రాజధాని పరిధిలోని మల్కాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు చిన చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన ఐదెకరాల చెరుకు పంటకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ పొలాన్ని పరిశీలించేందుకు వైఎస్ జగన్ సోమవారం వెళ్లారు. జగన్ వస్తుండడంతో చంద్రశేఖర్ తన పొలంలో షామియాన ఏర్పాటు చేశారు. జగన్ వచ్చిన సమయంలో తన గోడు వెల్లబోసుకున్నారు […]
జగన్ పరామర్శ మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఓ రైతుకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఏపీ రాజధాని పరిధిలోని మల్కాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు చిన చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన ఐదెకరాల చెరుకు పంటకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ పొలాన్ని పరిశీలించేందుకు వైఎస్ జగన్ సోమవారం వెళ్లారు. జగన్ వస్తుండడంతో చంద్రశేఖర్ తన పొలంలో షామియాన ఏర్పాటు చేశారు. జగన్ వచ్చిన సమయంలో తన గోడు వెల్లబోసుకున్నారు రైతు చంద్రశేఖర్. తాము గత ఎన్నికల్లో టీడీపీకే ఓటేశామని… కానీ తమకే ఈ పరిస్థితి తెచ్చారని వాపోయారు. తమ చెప్పుతో తాము కొట్టుకున్నట్టుగా అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రశేఖర్ పొలాన్ని పరిశీలించిన తర్వాత జగన్ మరో గ్రామానికి వెళ్లారు. ఇది జరిగిన రెండు గంటలకే చంద్రశేఖర్ పొలానికి ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. ఆ సమయంలో పొలంలో ఉన్న చంద్రశేఖర్ మేనల్లుడిని డీఎస్పీ పిలుస్తున్నారంటూ తీసుకెళ్లారు. షామియాన వేసిన కూలీలను కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారని బాధిత రైతు చంద్రశేఖర్ ఆవేదన చెందారు. తమకు జరిగిన అన్యాయాన్ని జగన్ వివరించడం వల్లే టీడీపీ నేతలు కక్ష కట్టి పోలీసులను పురామాయిస్తున్నారని వాపోయారు. తమ బాధ వినేందుకు వచ్చిన జగన్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రశేఖర్ చెప్పారు. మరో విశేషం ఏమిటంటే సదరు రైతు చంద్రశేఖర్ నాన్న గద్దె రత్తయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాంటి వారి పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్యుల సంగతేంటని జగన్ ప్రశ్నించారు.