ఆ విషయంలో రేవంత్ నచ్చారట

ఓటుకు నోటు కేసు ఎలా ఉన్నా… హద్దుమీరి చేసే విమర్శలు ఎలా ఉన్నా ఒక విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి తనలోని నాయకుడిని చాటుకున్నారని కొందరు టీడీపీ నేతలంటున్నారు. మంచో చెడో ఒక అభిమాని కోసం రేవంత్  చాలా దూరమే వెళ్లారని చెబుతున్నారు. చివరకు ఎర్రబెల్లితో కొట్టుకునేందుకైనా సిద్ధం అనే స్థాయికి వెళ్లారు. ఇంతకీ ఏం జరిగిందంటే… శనివారం టీటీడీపీ భేటీలో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో తిట్టుకున్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. అయితే […]

Advertisement
Update:2015-10-26 06:14 IST

ఓటుకు నోటు కేసు ఎలా ఉన్నా… హద్దుమీరి చేసే విమర్శలు ఎలా ఉన్నా ఒక విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి తనలోని నాయకుడిని చాటుకున్నారని కొందరు టీడీపీ నేతలంటున్నారు. మంచో చెడో ఒక అభిమాని కోసం రేవంత్ చాలా దూరమే వెళ్లారని చెబుతున్నారు. చివరకు ఎర్రబెల్లితో కొట్టుకునేందుకైనా సిద్ధం అనే స్థాయికి వెళ్లారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

శనివారం టీటీడీపీ భేటీలో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో తిట్టుకున్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. అయితే గొడవ ఆ స్థాయికి చేరడానికి కారణం వరంగల్ ఉప ఎన్నిక అంశమే కాకుండా దానికి ముందు జరిగిన ఓ ఘటన కూడా ఉందని చెబుతున్నారు. ఇటీవల ఓటుకు నోటు కేసులో బెయిల్‌పైన రేవంత్ రెడ్డి విడుదలైన రోజు ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్రంలో లేరు. ఆ రోజే ఆయన విమానం ఎక్కి విదేశాలకు వెళ్లారు.

అలా ఎర్రబెల్లి వెళ్లారో లేదో ఆయన పీఏ నేరుగా చంచల్‌గూడ జైలు వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ విషయం ఎర్రబెల్లికి తెలిసిపోయింది. అప్పటిదాకా తన విషయాలు రేవంత్‌కు ఎవరిద్వారా తెలుస్తున్నాయో ఎర్రబెల్లికి అర్ధమయింది. వెంటనే పీఏ పోస్టు నుంచి అతడిని తొలగించివేశారు. దీంతో మరోదారి లేని సదరు పీఏ నేరుగా రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పుకున్నారు. ”ఏం బాధపడవద్దు నేనున్నా” అంటూ ధైర్యం చెప్పిన రేవంత్ రెడ్డి అతడిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పీఏ హోదాలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కొలువు ఇప్పించారు.

శనివారం జరిగిన టీటీడీపీ భేటీ సమయంలో సదరు మాజీ పీఏ కనిపించే సరికి ఎర్రబెల్లి ఆగ్రహంతో ఊగిపోయారట. ”నేను పీకేసిన వాడిని నీవెలా పెట్టుకుంటావ్” అంటూ రేవంత్‌ను నిలదీశారు. ”ఇప్పటికే నీ వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది పద్దతి మార్చుకో” అంటూ రుసరుసలాడారు. దీనికి రేవంత్ కూడా అంతే స్థాయిలో ఫైర్ అయ్యారు. అనవసర విషయాల్లో తన జోలికి వస్తే రూంలో వేసి కొడుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద తప్పో ఒప్పో తన మీద అభిమానంతో చంచల్‌గూడ జైలుకు వచ్చి ఇబ్బంది పడిన వ్యక్తికి రేవంత్ అండగా నిలవడం మాత్రం టీడీపీనేతలను ఆకట్టుకుందట.

Tags:    
Advertisement

Similar News