రేవంత్, ఎర్రబెల్లి ఏమని తిట్టుకున్నారంటే
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికపై చర్చించేందుకు శనివారం జరిగిన టీటీడీపీ భేటీలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా వరంగల్ లోక్‌సభకు బీజేపీ అభ్యర్థే పోటీ చేసినందున ఈసారి కూడా బీజేపీ వారికే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి అభిప్రాయపడగా అందుకు రేవంత్ అభ్యంతరం చెప్పారు. వరంగల్‌లో టీడీపీకే బలం ఉందని సర్వే చెబుతున్నాయని కాబట్టి బీజేపీకి ఇవ్వడం సరికాదని అభ్యంతరం చెప్పారు. అర్థరాత్రి వెళ్లి పక్క […]
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికపై చర్చించేందుకు శనివారం జరిగిన టీటీడీపీ భేటీలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా వరంగల్ లోక్‌సభకు బీజేపీ అభ్యర్థే పోటీ చేసినందున ఈసారి కూడా బీజేపీ వారికే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి అభిప్రాయపడగా అందుకు రేవంత్ అభ్యంతరం చెప్పారు.
వరంగల్‌లో టీడీపీకే బలం ఉందని సర్వే చెబుతున్నాయని కాబట్టి బీజేపీకి ఇవ్వడం సరికాదని అభ్యంతరం చెప్పారు. అర్థరాత్రి వెళ్లి పక్క పార్టీల వారిని కలిసి వచ్చే వారు కూడా మిత్రధర్మం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు. దీంతో ఇద్దరి మధ్య మంట మండింది. పార్టీ సమావేశాలకు అప్పుడప్పుడు వస్తూ ఐటమ్ గర్ల్‌గా ఉండే నీవు కూడా సలహాలు ఇస్తావా అని రేవంత్‌పై ఎర్రబెల్లి మండిపడ్డారు.
ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమవగా సీనియర్లు జోక్యం చేసుకున్నారు. రేవంత్ తీరునే తప్పుపట్టారు. సీనియర్లను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. నీ వల్ల జరిగిన ఓటుకు నోటు ద్వారా ఇప్పటికే పార్టీ చాలా నష్టపోయిందని.. ఇకనైనా దుకూడు తగ్గించుకోవాలని సూచించారు.