కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక...

తెలంగాణ సీఎం కేసిఆర్ మూడు రోజుల హస్తిన పర్యటన ఖరారయ్యింది. మూడు రోజులపాటు సాగే ఈ పర్యటనలో ప్రధానంగా నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పనిలో పనిగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరు విషయం పై ప్రధానితో పాటు..పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోడిని కూడా కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కూడా కోరారు. ఇతర కేంద్ర మంత్రులును సైతం సీఎం కలవనున్నారు. గవర్నర్‌తో కేసీఆర్ భేటీ ఢిల్లీ […]

Advertisement
Update:2015-10-25 17:09 IST

తెలంగాణ సీఎం కేసిఆర్ మూడు రోజుల హస్తిన పర్యటన ఖరారయ్యింది. మూడు రోజులపాటు సాగే ఈ పర్యటనలో ప్రధానంగా నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పనిలో పనిగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరు విషయం పై ప్రధానితో పాటు..పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోడిని కూడా కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కూడా కోరారు. ఇతర కేంద్ర మంత్రులును సైతం సీఎం కలవనున్నారు.

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
ఢిల్లీ వెళ్లే ప్లాన్‌లో భాగంగానే సీఎం కేసిఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన నామినేటేడ్ పోస్టుల భర్తికి గవర్నర్ అమోదం కోరారు. కాగా ఢిల్లీ టూర్‌లో ప్రధానంగా రాష్ట్రంలో ప్రకటించబోతున్న ఇరిగేషన్ పాలసీపై కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి పవర్ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించి నిధులు కోరాలని ఆయన భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతు మరణాలపై కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి నిధులు కోరడంతోపాటు కరువు అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరనున్నట్లు తెలిసింది. విభజన చట్టంలోని అంశాల పరిష్కారం, ఉద్యోగుల విభజన, తొమ్మిది, పదో షెడ్యుల్లోని కార్పోరేషన్లు, సంస్ధలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదిని కోరనున్నట్లు సమాచారం. మొత్తానికి మూడు రోజుల పర్యటనలో రాష్ట్రానికి రావాల్సిన వివిధ శాఖల గ్రాంట్స్‌తోపాటు ఇతర రాజకీయ పరమైన అంశాలపై హస్తిన నేతలతో సమావేశం కానున్నారు సీఎం. అలాగే వచ్చేనెలలో తాను చేపట్టనున్న చండీ యాగానికి ప్రధానిని ఆహ్వానించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News