శ్రీమంతుడు కథ కొరటల శివ చౌర్యం చేశాడా..?
ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల కథల కాపీ వివాదాలు బాగా ఎక్కువయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యాక ..తమ కథనే కాపీ కొట్టి తీశారంటూ ఆధారాలతో ఫిల్మ్ ఛాంబర్ ని, రైటర్స్ అసోసియేషన్ ని సంప్రదించేవారు అధికమయ్యారు. ఇప్పుడు అలాంటి వివాదమే మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడుకు ఎదురయ్యింది. వివరాల్లోకి వెళితే.. ”నేను రాసుకున్న ‘చచ్చేంత ప్రేమ’ను సినిమాగా తీయడానికి జయలక్ష్మి ఫిలిమ్స్ వారికి హక్కులు ఇచ్చాను. నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో ఈ చిత్రం […]
ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల కథల కాపీ వివాదాలు బాగా ఎక్కువయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యాక ..తమ కథనే కాపీ కొట్టి తీశారంటూ ఆధారాలతో ఫిల్మ్ ఛాంబర్ ని, రైటర్స్ అసోసియేషన్ ని సంప్రదించేవారు అధికమయ్యారు. ఇప్పుడు అలాంటి వివాదమే మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడుకు ఎదురయ్యింది.
వివరాల్లోకి వెళితే.. ”నేను రాసుకున్న ‘చచ్చేంత ప్రేమ’ను సినిమాగా తీయడానికి జయలక్ష్మి ఫిలిమ్స్ వారికి హక్కులు ఇచ్చాను. నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తీయాలనుకున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన సన్నాహాల్లో ఉండగానే ‘శ్రీమంతుడు’ విడుదలైంది” అని రచయిత శరత్‌చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నవలలో ఉన్న కథకు స్వల్ప మార్పులు చేసి, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రం తీశారని జరిగిన మీడియా సమావేశంలో శరత్‌చంద్ర ఆరోపించారు.
”వాస్తవానికి ‘శ్రీమంతుడు’ రిలీజ్ టైమ్‌లో కేరళలో ఉన్నాను. నా మిత్రులు చెప్పడంతో ఆ సినిమా చూశాను. సినీ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశాను. కొంతమంది పరిశ్రమ పెద్దలతో కూడా చెప్పాను. కానీ, న్యాయం జరగలేదు. నాకూ, జయలక్ష్మి ఫిలిమ్స్ సంస్థ వారికీ న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాను” అన్నారు. మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’. మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ నేటితో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం 185 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ వివాదం చివరకు ఏ మలుపు తిరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.