జర్నలిస్టుపై కస్సుమన్న హోంమంత్రి
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి మీడియాపై కోపం వచ్చింది. గాలి వార్తలు రాస్తే కేసులు పెడుతామని మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైలులోని నూతన కాంప్లెక్స్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయట కదా అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించడంతో నాయిని కోపం కట్టలు తెంచుకుంది. గాలి మాటలు మాట్లాడొద్దు అంటూ రుసరుసలాడారు.మీ పత్రికలొళ్లతో వచ్చిన సమస్యే ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”అక్రమాలు జరిగాయని ఎవడన్నాడో చెప్పు… ఆధారాలు చూపించు. నీవే సొంతంగా ఆరోపణలు […]
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి మీడియాపై కోపం వచ్చింది. గాలి వార్తలు రాస్తే కేసులు పెడుతామని మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైలులోని నూతన కాంప్లెక్స్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయట కదా అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించడంతో నాయిని కోపం కట్టలు తెంచుకుంది.
గాలి మాటలు మాట్లాడొద్దు అంటూ రుసరుసలాడారు.మీ పత్రికలొళ్లతో వచ్చిన సమస్యే ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”అక్రమాలు జరిగాయని ఎవడన్నాడో చెప్పు… ఆధారాలు చూపించు. నీవే సొంతంగా ఆరోపణలు చేస్తున్నావ్” అంటూ మీడియా ప్రతినిధిపై ఫైర్ అయ్యారు. హోంమంత్రి ఆవేశంతో అందరు సైలెంట్ అయిపోయారు. ప్రతి దానిలోనూ అవినీతి అనడం జర్నలిస్టులకు ఊతపదంగా మారిందని పెద్దాయన ఊగిపోయారు.
ఆధారాలు లేకుండా గాలి మాటలు మాట్లాడితే జర్నలిస్టులపై కేసులు పెడుతామని బెదిరించారు. ఏది పడితే అది మాట్లాడవచ్చన్న దోరణిలో జర్నలిస్టుల్లో పెరిగిపోయిందన్నారు. నాయిని ఆవేశాన్ని చల్లార్చేందుకు పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రయత్నించారు.