స్టోరి కోన వెంకట్ -ఒరిజినల్ స్టోరి శ్రీను వైట్ల...

‘స్టోరి-ఒరిజినల్ స్టోరి’ అని వేరు వేరుగా ఉంటాయా? అనే డవుట్ మీకు రావొచ్చు. మీకే కాదు.. ‘బ్రూస్ లీ’ టైటిల్ క్రెడిట్స్ చూస్తే, ఎవరికైనా ఇవే డవుట్స్ వస్తాయి.బ్రూస్ లీ మూవీ టైటిల్ క్రెడిట్స్‌లో ‘స్టోరీ బై కోన వెంకట్’ అని … ‘స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ & ఒరిజినల్ స్టోరి బై శ్రీను వైట్ల’ అని ఉండడం చూసి  అందరికి ఈ డవుట్ రావడం ఖాయం.  అసలు జరిగిందేమిటంటే.. శ్రిను వైట్ల ‘బ్రూస్ లీ’తో బిజీగా ఉన్నప్పుడు, […]

Advertisement
Update:2015-10-22 11:16 IST
‘స్టోరి-ఒరిజినల్ స్టోరి’ అని వేరు వేరుగా ఉంటాయా? అనే డవుట్ మీకు రావొచ్చు. మీకే కాదు.. ‘బ్రూస్ లీ’ టైటిల్ క్రెడిట్స్ చూస్తే, ఎవరికైనా ఇవే డవుట్స్ వస్తాయి.బ్రూస్ లీ మూవీ టైటిల్ క్రెడిట్స్‌లో ‘స్టోరీ బై కోన వెంకట్’ అని … ‘స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ & ఒరిజినల్ స్టోరి బై శ్రీను వైట్ల’ అని ఉండడం చూసి అందరికి ఈ డవుట్ రావడం ఖాయం.
అసలు జరిగిందేమిటంటే.. శ్రిను వైట్ల ‘బ్రూస్ లీ’తో బిజీగా ఉన్నప్పుడు, కోన వెంకట్ ‘శంకరాభరణం’ తో బిజి అయిపోయారు. మొదటి భాగాన్ని కోన వెంకట్ సిద్ధం చేశారు. సెకండ్ పార్ట్ ను కోన సిస్టర్ సెంటిమెంట్ తో చాలా పవర్ ఫుల్ లైన్ తయ్యారు చేశాడట. వీరిద్దరు బిజీగా ఉండడంతో శ్రీను వైట్ల ‘బ్రూస్ లీ’ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మార్చేసి తాను అనుకున్నట్లుగా.. ఒక ఫ్రెంఛ్ మూవీ ‘వాలెట్’ నుండి లిఫ్ట్ చేసేసాడు. మొదటి పార్ట్ కంటిన్యుయేషన్ గా సెకండ్ హాఫ్‌లో రావలసిన సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ అన్ని మార్చి తీసాడు కనుక సెకండ్ హాఫ్ చాలా వీక్ గా రావటంతో ‘బ్రూస్ లీ’ కొంప ముంచింది. ఇది సినిమా విడుదల అయ్యాక గమనించిన కోన వెంకట్, ఇకపై శ్రీను వైట్లతో కలిసి పని చేసే చాన్స్ లేదంటున్నాడని ఇండస్టీలో టాక్.
Tags:    
Advertisement

Similar News