"శ్రీమంతుడి"పై నిందలేస్తున్న స్టార్ హీరోలు!

తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల దత్తతుపై చాలామందికి స్పూర్తినిచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా చూశాక చాలా మందిలో గ్రామాలు దత్తతు తీసుకోవాలన్న ఆలోచన బలపడింది. అయితే విచిత్రంగా తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ఆ ట్రెండ్ కనిపించలేదు. మహేష్‌బాబు, ప్రకాశ్ ‌రాజ్ ఇలా ఒకరిద్దరు మాత్రమే దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.  అగ్ర హీరోలు ఎవరూ గ్రామల దత్తతుకు ముందుకు రావడం లేదు. దీని కారణం కూడా శ్రీమంతుడు సినిమాయేనట. దానికి హీరోల సన్నిహితులు చెబుతున్న కథేంటంటే. ఒక […]

Advertisement
Update:2015-10-22 05:52 IST

తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల దత్తతుపై చాలామందికి స్పూర్తినిచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా చూశాక చాలా మందిలో గ్రామాలు దత్తతు తీసుకోవాలన్న ఆలోచన బలపడింది. అయితే విచిత్రంగా తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ఆ ట్రెండ్ కనిపించలేదు. మహేష్‌బాబు, ప్రకాశ్ ‌రాజ్ ఇలా ఒకరిద్దరు మాత్రమే దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. అగ్ర హీరోలు ఎవరూ గ్రామల దత్తతుకు ముందుకు రావడం లేదు. దీని కారణం కూడా శ్రీమంతుడు సినిమాయేనట. దానికి హీరోల సన్నిహితులు చెబుతున్న కథేంటంటే.

ఒక వేళ ఏ అగ్రహీరో అయినా గ్రామాలను దత్తతు తీసుకునేందుకు ముందుకొస్తే చూసిన వారంతా ఇది మహేష్‌బాబు శ్రీమంతుడి సినిమా ప్రభావమేనని అనుకుంటారు. అంటే గ్రామాలు తాము దత్తతు తీసుకున్నా దానిలో సగం క్రెడిట్ మహేష్‌బాబుకే వెళ్తుందన్నది అగ్రహీరోల భావన. గ్రామాల దత్తతు తీసుకున్న సమయంలో మీడియా హడావుడిని కూడా గుర్తు చేస్తున్నారు. తాము దత్తతు తీసుకున్న గ్రామాలకు వెళ్తే బ్యాగ్రౌండ్‌లో ”పోరా శ్రీమంతుడా పోపోరా శ్రీమంతుడా” అంటూ సాంగ్ ప్లే చేసి మళ్లీ క్రెడిట్ శ్రీమంతుడు సినిమాకు, మహేష్‌బాబుకే వెళ్లేలా చేస్తారని పబ్లిసిటీ లెక్కలేస్తున్నారు.

అందుకే ఇప్పుడున్న పరిస్థితిలో గ్రామాన్ని దత్తతు తీసుకుంటే దాని వల్ల తమకు వచ్చే పేరు కన్నా మహేష్ బాబు, అతడి శ్రీమంతుడు సినిమాకు వచ్చే పేరే ఎక్కువుంటుందని ఆలోచన చేస్తున్నారట. ఇటీవల మీడియా వాళ్లు హీరో రామ్ చరణ్‌ గ్రామల దత్తతుపైనా అడిగారు. ఆయన మాత్రం సింపుల్‌గా డబ్బులు సంపాదించిన తర్వాత గ్రామాన్ని దత్తతు తీసుకుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదన్న మాట గ్రామాలు దత్తతు తీసుకోవాల్సిందిగా కోరితే కొందరు హీరోలు డబ్బుల్లేవంటున్నారు. మరికొందరు శ్రీమంతుడు సినిమా వల్ల క్రెడిట్ తమకు రాదని జారుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News