తెలంగాణ పోలీసులకు కేసీఆర్‌ వరాలు

తెలంగాణ రాష్ట్రంలో పని చేసే పోలీసులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించారు. కొత్తగా నిర్మించబోయే గృహాల్లో 10 శాతం వారికి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. హోంగార్డు నుంచి ఏఎస్‌ఐ వరకు తాలూకాల స్థాయిలో ఎస్సై నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు మున్సిపల్‌ ప్రాంతాల్లో ఈ నివాసాలు కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. పోలీసు కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎసైలకు, హోంగార్డులకు, మాజీ సైనికులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లో పదిశాతాన్ని కేటాయిస్తామని పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవం సందర్భంగా […]

Advertisement
Update:2015-10-21 19:58 IST

తెలంగాణ రాష్ట్రంలో పని చేసే పోలీసులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించారు. కొత్తగా నిర్మించబోయే గృహాల్లో 10 శాతం వారికి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. హోంగార్డు నుంచి ఏఎస్‌ఐ వరకు తాలూకాల స్థాయిలో ఎస్సై నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు మున్సిపల్‌ ప్రాంతాల్లో ఈ నివాసాలు కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. పోలీసు కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎసైలకు, హోంగార్డులకు, మాజీ సైనికులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లో పదిశాతాన్ని కేటాయిస్తామని పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని గోషామహల్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం ప్రకటించారు. అమరవీరు స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఎస్‌ఐ స్థాయి అధికారులకు మున్సిపాలిటీల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం అదనపు వేతనం ఇస్తామని కేసీఆర్‌ తెలిపారు. పోలీసులు కార్యకలాపాల కోసం త్వరలో బంజారాహిల్స్‌లో 24 అంతస్థులతో అధునాతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. అలాగే పోలీసులకు యేడాదికి ఇచ్చే వాషింగ్‌ అలవెన్సును కూడా రూ. 3500 నుంచి 7500 రూపాయలకు పెంచనున్నట్టు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News