కేసీఆర్ తో బాబు మీట్ " రేవంత్ అలక

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నిజం ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతకాలం కేసీఆర్ పైనా, ఆయన ప్రభుత్వంపైనా తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డికి చంద్రబాబు వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆయన ఇంటికి వెళ్లిమరీ చంద్రబాబు ఆహ్వానించడంపై రేవంత్ ఆసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. క్యాంపు ఆఫీసులో ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, […]

Advertisement
Update:2015-10-21 07:33 IST

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నిజం ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతకాలం కేసీఆర్ పైనా, ఆయన ప్రభుత్వంపైనా తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డికి చంద్రబాబు వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆయన ఇంటికి వెళ్లిమరీ చంద్రబాబు ఆహ్వానించడంపై రేవంత్ ఆసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. క్యాంపు ఆఫీసులో ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావులను మాత్రమే వెంటబెట్టుకుని వెళ్లడంతో.. తనను పట్టించుకోలేదన్న భావనలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది.

నిజానికి కేసీఆర్ పైనా, మైహోం సిమెంట్స్ అధినేత రామేశ్వరరావు పైనా, ఇతర టీఆర్ఎస్ నాయకులపైనా రేవంత్ చేసినన్ని ఆరోపణలు టీడీపీలో ఎవరూ చేయలేదు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్కైన రేవంత్ కు ఇప్పుడు బాబు వ్యవహార శైలితో అసంతృప్తికి దారితీస్తోందని సమాచారం. తెలంగాణలో టీడీపీ ఉనికిని కాపాడేందుకు అధినేత చెప్పినట్టు చేసి ఇరుక్కుపోయానని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఇబ్బందుల్లో తాను ఉంటే.. బాబే స్వయంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News