ఒంటరైన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఒంటరయ్యారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించవద్దని ముందే లేఖ రాసి అందర్నీ ఆశ్చర్యపర్చిన వైఎస్ జగన్.. ఆ తర్వాత మంత్రులు ఇంటికి వెళ్లి ఆహ్వానించేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో జగన్ తీరుపై అటు రాజధాని ప్రాంత ప్రజలతోపాటు స్థానిక వైసీపీ నాయకులూ అసంతృప్తికి లోనయ్యారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. పక్క […]

Advertisement
Update:2015-10-20 08:22 IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఒంటరయ్యారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించవద్దని ముందే లేఖ రాసి అందర్నీ ఆశ్చర్యపర్చిన వైఎస్ జగన్.. ఆ తర్వాత మంత్రులు ఇంటికి వెళ్లి ఆహ్వానించేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో జగన్ తీరుపై అటు రాజధాని ప్రాంత ప్రజలతోపాటు స్థానిక వైసీపీ నాయకులూ అసంతృప్తికి లోనయ్యారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. పక్క రాష్ట్ర సీఎం కేసీఆరే అమరావతికి వస్తుంటే జగన్ రాకపోడం ఇప్పుడు మరింత చర్చనీయాంశం అవుతోంది.
అయితే జగన్ శంకుస్థాపన ఆహ్వానం పంపొద్దని, వేడుకకు రాకపోవడానికి ఆయన చూపించిన 8 కారణాల్లో కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ.. వెళ్లి ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. ఒకవేళ భవిష్యత్తులో జగన్ సీఎం అయితే అమరావతికి రారా? అని ప్రశ్నించే వారూ ఉన్నారు. అయితే జగన్ రాకపోడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయట. ఏపికి ప్రత్యేక హోదా కోసం ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా పెద్దగా సానుభూతి రాలేదన్న భావన ఆయనలో ఉందట. తెలంగాణ ఉద్యమ టైమ్ లో కేసీఆర్ దీక్ష చేస్తే పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. అయితే ఇక్కడ జగన్ కు అందులో సగం కూడా కవరేజ్ రాలేదు. దీనంతటికీ చంద్రబాబు మీడియా మేనేజ్ మెంటే కారణమన్న భావన జగన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
రేపు రాజధాని శంకుస్థాపనకు ప్రతిపక్ష నాయకుడిగా వెళ్లినా ఎక్కడో ఓమూలన కూర్చోవాల్సి వస్తుందన్నది జగన్ ఆలోచనట. అక్కడ ఎలాగూ మీడియా అంతా సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీనే ఫోకస్ చేస్తారని జగన్ వర్గం భావిస్తోందట. అందుకే తనకు ప్రాధాన్యత లేని చోటకు వెళ్లడం మంచిది కాదన్న భావనలో వైఎస్ జగన్ ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అమరావతి శంకుస్థాపనకు వెళ్తుండడంతో జగన్ పూర్తిగా ఈ వ్యవహారంలో ఒంటరైనట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News