'గీత' కథ..కొత్త మలుపు...

పాకిస్థాన్‌లో ఉంటూ గత 14 ఏళ్లుగా అజ్ఞాత వాసం చేస్తున్న గీత… తన కన్న తల్లిదండ్రుల కోసం ‘గీత’ ఆరాటం… సఫలమైంది… తన కుటుంబసభ్యులు ఎక్కడున్నారో గుర్తించింది. త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతలోనే గీత కథ కొత్త మలుపు తిరిగింది. ఆమె తన కుటుంబం సభ్యులను గుర్తు పట్టిందని, త్వరలో భారత్ వస్తోందని అనుకుంటున్న తరుణంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గీత తన కుటుంబంగా గుర్తు పట్టినవారు బీహార్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే […]

Advertisement
Update:2015-10-20 07:34 IST

పాకిస్థాన్‌లో ఉంటూ గత 14 ఏళ్లుగా అజ్ఞాత వాసం చేస్తున్న గీత… తన కన్న తల్లిదండ్రుల కోసం ‘గీత’ ఆరాటం… సఫలమైంది… తన కుటుంబసభ్యులు ఎక్కడున్నారో గుర్తించింది. త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతలోనే గీత కథ కొత్త మలుపు తిరిగింది. ఆమె తన కుటుంబం సభ్యులను గుర్తు పట్టిందని, త్వరలో భారత్ వస్తోందని అనుకుంటున్న తరుణంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గీత తన కుటుంబంగా గుర్తు పట్టినవారు బీహార్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే వారిప్పుడు గీతకు సంబంధించి ఓ కొత్త విషయాన్ని బయటపెట్టారు. గీత మైనర్‌గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లి చేసినట్టు చెబుతున్నారు. అంతే కాదు గీతకి ఒక బాబు కూడా ఉన్నాడని కుటుంబసభ్యులు అంటున్నారు. గీత తప్పిపోక ముందు ఫోటోగా ఒక బాలిక ఫోటోని వారు చూపించారు. అయితే అది తనది కాదని చెప్పింది గీత. తనకు అసలు పెళ్లే కాలేదని తెగేసి చెప్పింది. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అక్టోబర్ 26న గీతను తీసుకుని ఫైజల్ ఈది(కరాచీలో గీతకు ఆశ్రయమిచ్చిన ఈది ఫౌండేషన్ నిర్వాహకుడు) అతని భార్య భారత్‌కి రావాలన్నది నిర్ణయం. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాక గీత ఆ కుటుంబానికే చెందిందని నిరూపణ అయితే అప్పుడు ఆ అమ్మాయిని బీహార్ కుటుంబానికి అప్పచెబుతామని పాకిస్థాన్‌లోని భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్ చెబుతున్నారు. గీతకు పెళ్ళి… ఆమెకో బాబు అన్న విషయమే కాదనుకున్న వేళ అసలు గీత అసలు వారి సంతానమేనా అన్నది ఇపుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరి గీత కథ సుఖాంతం..అవుతుందా ?

Tags:    
Advertisement

Similar News