నాగం ఎజెండా ఏంటి?
ఇటీవల తాను పార్టీని వీడటం లేదని స్పష్టం చేసిన నాగం జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం ఏ వేదిక మీదున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. ఆయన బీజేపీలో కొనసాగుతున్నారా? తెలంగాణ బచావో వ్యవస్థాపకులుగా ఉన్నారా? అన్న విషయంపై ప్రజలకు స్పష్టత రావడం లేదు. ఇంతకీ ప్రజలకు ఈ విషయంలో ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే.. ఆయన పార్టీ తీరుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు. తాజాగా ఆయన పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు. పథకం మంచిదేనని కాకపోతే.. […]
Advertisement
ఇటీవల తాను పార్టీని వీడటం లేదని స్పష్టం చేసిన నాగం జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం ఏ వేదిక మీదున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. ఆయన బీజేపీలో కొనసాగుతున్నారా? తెలంగాణ బచావో వ్యవస్థాపకులుగా ఉన్నారా? అన్న విషయంపై ప్రజలకు స్పష్టత రావడం లేదు. ఇంతకీ ప్రజలకు ఈ విషయంలో ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే.. ఆయన పార్టీ తీరుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు. తాజాగా ఆయన పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు. పథకం మంచిదేనని కాకపోతే.. రైతుల నుంచి బలవంతంగా భూమి లాగేసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. అంతేనా? ఒకవేళ సేకరించాల్సి వస్తే.. మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు ధర కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు నాగంపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ నేతల్లా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
ఎందుకు?
దేశంలో కావాల్సిన చోట భూ సేకరణ జరిపేందుకు ఉద్దేశించి భూ సేకరణచట్టం-2013కు సవరణలతో కూడిన బిల్లును ఏడాదికాలంగా బీజేపీ ఆమోదించుకోలేకపోయింది. ఎన్ని ఆర్డినెన్సులు జారీ చేసినా.. ప్రతిపక్షాలు ససేమీరా అంటున్నాయి. ఎందుకంటే పాత బిల్లు ప్రకారం రైతుల భూములు సేకరించాల్సి వచ్చినపుడు నాలుగురెట్లు పరిహారం చెల్లించాలి. బీజేపీ ఈ అంశాన్ని సవరణ బిల్లులో తొలగించింది. దీంతో రాజ్యసభలో బిల్లు తిరస్కరణకు గురైంది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ప్రతిపక్షాల వల్ల పార్లమెంటు సమవేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతటి కీలకమైన అంశంలో బీజేపీ ప్రతిష్ట కొద్దిగా మసకబారింది. అలాంటిది కాంగ్రెస్ ప్రధాన డిమాండ్లు, ప్రతిపక్షాల చేతిలో బలమైన ఆయుధంగా మారిన భూసేకరణ విషయంలో నాగం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Advertisement