గిన్నీస్ బుక్ ఎక్కనున్న రాజధాని శంకుస్థాపన‌

అమరావతి శంకుస్థాపన పవిత్ర కార్యం అంటూనే ప్రచారం విషయంలోనూ  చంద్రబాబు ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శంకుస్థాపన కార్యక్రమం కవరేజ్‌కు జాతీయ అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించిన ప్రభుత్వం ఇప్పుడు మరో ప్రయత్నం మొదలు పెట్టింది. ఈవెంట్ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయేందుకు గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారిని సంప్రదించింది. చరిత్ర ఎరుగని స్థాయిలో వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న కార్యక్రమం కావడంతో గిన్నిస్‌లోకి ఎక్కే అర్హత కూడా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 16 […]

Advertisement
Update:2015-10-18 03:12 IST

అమరావతి శంకుస్థాపన పవిత్ర కార్యం అంటూనే ప్రచారం విషయంలోనూ చంద్రబాబు ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శంకుస్థాపన కార్యక్రమం కవరేజ్‌కు జాతీయ అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించిన ప్రభుత్వం ఇప్పుడు మరో ప్రయత్నం మొదలు పెట్టింది.

ఈవెంట్ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయేందుకు గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారిని సంప్రదించింది. చరిత్ర ఎరుగని స్థాయిలో వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న కార్యక్రమం కావడంతో గిన్నిస్‌లోకి ఎక్కే అర్హత కూడా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 16 వేల గ్రామాల నుంచి మట్టి, నీరు సేకరించడం, కార్యక్రమంలో కల్చరల్ ఈవెంట్, స్థల విస్తీర్ణం వంటి అంశాల ఆధారంగా శంకుస్థాపనను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న కార్యక్రమం కావడంతో… ఈ రికార్డు ఇప్పట్లో బద్దలయ్యే అవకాశం కూడా ఉండదని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శంకుస్థాపన కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం విశేషం. మొత్తం మీద దేనినైనా ప్రచారం చేసుకోవడంతో ముందుండే చంద్రబాబు శంకుస్థాపనను కూడా బాగానే వాడుకుంటున్నట్టు అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News