రోడ్డున పడ్డ కేసీఆర్ దత్తత గ్రామం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం జరగడంతో ఓ గ్రామం రోడ్డునపడింది. ఇటీవల సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరును దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన హామీని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారో.. ద్వితీయ శ్రేణి నాయకులు తప్పుదోవ పట్టించారో తెలియదు గానీ, ఈ ఊర్లో చాలామందికి ఇప్పుడు నిలువనీడ కరువైంది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం! ఏం […]
Advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం జరగడంతో ఓ గ్రామం రోడ్డునపడింది. ఇటీవల సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరును దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన హామీని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారో.. ద్వితీయ శ్రేణి నాయకులు తప్పుదోవ పట్టించారో తెలియదు గానీ, ఈ ఊర్లో చాలామందికి ఇప్పుడు నిలువనీడ కరువైంది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం!
ఏం జరిగిందంటే..?
రెండు నెలల క్రితం తెలంగాణ సీఎం గ్రామజ్యోతిలో భాగంగా కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరును దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా ఇళ్లు లేని వారికి, పాత ఇళ్లు ఉన్నవారికి కొత్త ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చింది కేవలం హామీనే! కొత్త ఇళ్లు పొందేందుకు ఎవరు అర్హులన్న విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు జారీచేయలేదు. గ్రామంలో చోటా మోటా నాయకులు అందరికీ ఇళ్లిప్పిస్తామని తమ మెహర్బానీ ప్రకటించారు. మబ్బుల్లో నీళ్ల కోసం ముంతలో నీళ్లు పారబోసుకున్నట్లు తయారైంది గ్రామస్తుల తీరు. ఇంకేముంది? దరఖాస్తు చేసుకోకముందే ఇళ్లన్నీ కూలగొట్టారు. మరోసారి కేసీఆర్ రాగానే వారందరికీ ఇళ్లు ఇస్తాడని ప్రచారం జరిగింది. కానీ, ఈలోగా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వారిలో వడపోత జరిపి అసలైన అర్హులు కేవలం 150 మంది అని తేల్చారు. దీంతో ఇళ్లు కూలగొట్టుకున్నవాళ్లు లబోదిబోమంటున్నారు. కొత్త ఇల్లు వస్తుందని, ఉన్న కొంప కూలగొట్టుకున్నామంటూ రోదిస్తున్నారు. దీనికంతటికీ కారణం గ్రామస్తులను తప్పుదోవ పట్టించిన చోటా నాయకులే. కొత్త ఇళ్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకముందే దగ్గరుండి ఇళ్లు కూలగొట్టించారు. ఇప్పుడు మొహం చాటేశారు. వారి మాట నమ్మిన ప్రజలు రోడ్డునపడి ధర్నాలు చేస్తున్నారు.
ఎక్కడ చూసినా కూలిన ఇళ్లే!
ఇప్పడు గ్రామంలో ఎక్కడ చూసినా కూల్చిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. కిందిస్థాయి నేతల మాటలను నమ్మి ఇళ్లు కూలగొట్టుకుని గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. అసలే చలికాలం పగలంతా రోడ్లపై దుమ్ము, రాత్రంతా చలితో నానా కష్టాలు పడుతున్నారు. మరోవైపు ఎవరి మాటలో నమ్మి ఇళ్లు కూలగొట్టుకున్నామని భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య గొడవలు పంచాయతీలు జరుగుతున్నాయి. ఇళ్లు కూలగొట్టుకున్న బాధితుల్లో ఎక్కువ ఉమ్మడి కుటుంబాలకు చెందినవారే కావడంతో బాధితుల సంఖ్య అధికంగా ఉంది.
Advertisement