5 లక్షల ఇళ్ళకు ఆస్తి పన్ను రూ. 101

మొన్న 1475 మురికివాడల్లో నివశించేవారికి నల్లా, కరెంట్‌ బిల్లుల్లో రాయితీ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉండే నివాసితులకు మరో రాయితీ ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నివాసం ఉండి ఆస్తి పన్నుగా యేడాదికి 12 వందలు… ఆలోపు చెల్లిస్తున్న వారికి ఇక నుంచి 101 రూపాయలు మాత్రమే ఆస్తి పన్ను ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆస్తి పన్ను నామమాత్రంగా ఉంచాలన్న లక్ష్యంతోనే సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ. […]

Advertisement
Update:2015-10-16 02:30 IST
మొన్న 1475 మురికివాడల్లో నివశించేవారికి నల్లా, కరెంట్‌ బిల్లుల్లో రాయితీ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉండే నివాసితులకు మరో రాయితీ ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నివాసం ఉండి ఆస్తి పన్నుగా యేడాదికి 12 వందలు… ఆలోపు చెల్లిస్తున్న వారికి ఇక నుంచి 101 రూపాయలు మాత్రమే ఆస్తి పన్ను ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆస్తి పన్ను నామమాత్రంగా ఉంచాలన్న లక్ష్యంతోనే సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ. 1200 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి రూ. 101 చెల్లించే విధంగా చేసిన నిర్ణయం అమల్లోకి వస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఐదు లక్షల మంది లబ్ది పొందుతారు. దీనిపై సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సూచించారు. అలాగే గ్రేటర్‌ పరిధిలోని అధ్వాన్నంగా ఉన్న రహదారులన్నీ నెల రోజుల లోపు మరమ్మతులు చేపట్టాలని కూడా అదేశించారు. వర్షాలతో నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమయ్యాయని, యుద్ధప్రాతిపదికన రహదారుల మరమ్మతులు జరపాలని, పది రోజుల్లో పనులు ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైలు నిర్మాణ ప్రాంతాల్లో ధ్వంసమైన రహదారులకు సైతం మరమ్మతులు చేయాలని, మెట్రో పనులకు ఆటంకం కలగకుండా ఈ పనులు పూర్తి చేయాలని సూచించారు.
Tags:    
Advertisement

Similar News