ఒకసారి చెప్పాం కదా... నో అపాయింట్‌మెంట్ !
అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే విషయంలో జగన్ ఏ మాత్రం పునరాలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదు. శంకుస్థాపనకు ఆహ్వానించవద్దని, ఆహ్వానించినా తాను రాబోనని జగన్ స్పష్టం చేసినప్పటికి ప్రభుత్వం తరపు నుంచి ప్రయత్నాలు జరిగాయి. జగన్‌ను కలిసేందుకు మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు అపాయింట్‌మెంట్ కోరారని సమాచారం. అయితే అనారోగ్యం కారణంగా కలవడం కుదరదని జగన్ తెగేసి చెప్పారని తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ కార్యాలయ సిబ్బంది మంత్రులకు తెలియజేశారు. శంకుస్థాపనకు వచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని కూడా […]
అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే విషయంలో జగన్ ఏ మాత్రం పునరాలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదు. శంకుస్థాపనకు ఆహ్వానించవద్దని, ఆహ్వానించినా తాను రాబోనని జగన్ స్పష్టం చేసినప్పటికి ప్రభుత్వం తరపు నుంచి ప్రయత్నాలు జరిగాయి. జగన్‌ను కలిసేందుకు మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు అపాయింట్‌మెంట్ కోరారని సమాచారం.
అయితే అనారోగ్యం కారణంగా కలవడం కుదరదని జగన్ తెగేసి చెప్పారని తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ కార్యాలయ సిబ్బంది మంత్రులకు తెలియజేశారు. శంకుస్థాపనకు వచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని కూడా కార్యాలయ సిబ్బంది చెప్పారట. శంకుస్థాపన కార్యాలయానికి జగన్ రాకపోతే రాజధాని వ్యవహారంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావన ప్రభుత్వంతో బలంగా ఉందని చెబుతున్నారు. అందుకే జగన్‌ను కలిసి పరిస్థితిని వివరించాని మంత్రులు భావించారట. అయితే జగన్‌ను కలిసేందుకు మంత్రులు మరోసారి ప్రయత్నిస్తారా లేక ఇంతటితో వదిలేస్తారా అన్నది చూడాలి.