అమిత్‌ షాకు హార్దిక్‌ పటేల్‌ సవాల్‌

మంద బలంతో పటేళ్ళ ఉద్యమాన్ని అణిచి వేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, తాను బతికి ఉన్నంత కాలం ఆయనకు ఇది సాధ్యం కాదని ఓబీసీ రిజర్వేషన్‌ సాధన సమితి నేత హార్థిక్‌ పటేల్‌ సవాలు విసిరారు. తమ ఉద్యమంలో జోక్యం చేసుకోవద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఆయన చెప్పినంత మాత్రాన ఉద్యమం ఆపుతామా అని ప్రశ్నించారు. తాను బతికున్నంత కాలం ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని, ఇది ఆగాలంటే […]

Advertisement
Update:2015-10-15 09:30 IST
మంద బలంతో పటేళ్ళ ఉద్యమాన్ని అణిచి వేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, తాను బతికి ఉన్నంత కాలం ఆయనకు ఇది సాధ్యం కాదని ఓబీసీ రిజర్వేషన్‌ సాధన సమితి నేత హార్థిక్‌ పటేల్‌ సవాలు విసిరారు. తమ ఉద్యమంలో జోక్యం చేసుకోవద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఆయన చెప్పినంత మాత్రాన ఉద్యమం ఆపుతామా అని ప్రశ్నించారు. తాను బతికున్నంత కాలం ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని, ఇది ఆగాలంటే పటేళ్ళకు న్యాయం జరిగి తీరాల్సిందేనని ఆయన అన్నారు. తామేం హరేన్‌ పాండ్యా, అమిత్‌ జెత్వా, సంజయ్‌ జోషిలం కాదని, అమిత్‌ షా ఎలా పని చేస్తారో తమకు తెలుసునని, ఆయన కుతంత్ర వైఖరి వల్లే ధర్నాలు, నిరసనలు, సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతులు రావడం లేదని హార్దిక్‌ ఆరోపించారు. తమ ఉద్యమాన్ని అణిచివేయాలని అమిత్‌ చూస్తున్నారని, ఇది జరగాలని మనస్పూర్తిగా అమిత్‌ షా కోరుకుంటే తనను చంపేసి ప్రయత్నించాలని, ఒకవేళ నిజంగా చంపేసినా వేలాది మంది హార్దిక్‌ పటేళ్ళు పుట్టుకొచ్చి పటేళ్ళకు న్యాయం జరిగేలా చూస్తారని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు.
Tags:    
Advertisement

Similar News