ప్రధానితోనూ బీద అరుపులు
ఏపీ ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న పనికి పొంతన కుదరడం లేదు. ఈ విషయం అందరికీ అర్థమవుతున్నా చంద్రబాబు మాత్రం తనకేమీ అర్థం కానట్టు మాటలతో పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ తంతులోకి ప్రధాని మోదీని కూడా దించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రాజధాని శంకుస్థాపనకు రావబోతున్న ప్రదాని మోదీ చేత రాజధానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిప్పిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రధాని పిలుపు వల్ల మరింత మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తారని ఆయన అంటున్నారు.. చంద్రబాబు వ్యాఖ్యలపై […]
ఏపీ ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న పనికి పొంతన కుదరడం లేదు. ఈ విషయం అందరికీ అర్థమవుతున్నా చంద్రబాబు మాత్రం తనకేమీ అర్థం కానట్టు మాటలతో పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ తంతులోకి ప్రధాని మోదీని కూడా దించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రాజధాని శంకుస్థాపనకు రావబోతున్న ప్రదాని మోదీ చేత రాజధానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిప్పిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రధాని పిలుపు వల్ల మరింత మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తారని ఆయన అంటున్నారు.. చంద్రబాబు వ్యాఖ్యలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
పదవి చేపట్టిన తర్వాత రాజదాని నిర్మాణానికి విరాళం ఇవ్వాలంటూ చంద్రబాబు పిలుపునివ్వగా మొదట్లో బాగానే స్పందన వచ్చింది. అయితే ఓ వైపు డబ్బులు లేవంటూనే నిత్యం ప్రత్యేక విమానాల్లో విహంగవీక్షణాలు చేయడం…. కోట్లు పెట్టి ఆఫీసులకు డెకరేషన్లు వేయడం, రెండు వేల కోట్లు కుమ్మరించి గోదావరి పుష్కరాలను నిర్వహించడంతో విరాళాల రావడం ఒక్కసారిగా నిలిచిపోయాయి.
రాష్ట్రం కష్టాల్లో ఉందన్న ఆవేదనతో తాము డబ్బులు పంపుతుంటే చంద్రబాబు, ఆయన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారన్న భావన జనంలో పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వం కూడా అంచనాకు వచ్చారు. ఇప్పుడు ప్రధానితో పిలుపునిప్పించడం ద్వారా మరోసారి జనం నుంచి అంతో ఇంతో రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు ప్రపొజల్‌పై పెదవి విరుస్తున్నారు. దుబారాయే హాబీగా చంద్రబాబు పాలన నడుస్తున్న నేపథ్యంలో విరాళాలు ఇవ్వండని ఎవరు పిలుపునిచ్చినా అభాసుపాలు కావడం తప్ప మరొకటి ఉండదని చెబుతున్నారు. చంద్రబాబు తాను పూసుకున్న బురదను ప్రధానికి కూడా అంటించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.