ఆ టైమ్‌లో ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారు?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి ఏకంగా పదిన్నర గంటలకు విశాఖలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ టైమ్‌లో ప్రెస్ మీట్ ఉన్నట్టు సమాచారం రావడంతో ఏదో పెద్ద అంశంపైనే మాట్లాడుతారని మీడియా ప్రతినిధులు భావించారు.  కానీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు. సాధారణంగా ప్రెస్‌మీట్ పెడితే 45 నిమిషాలకు తగ్గకుండా మాట్లాడే చంద్రబాబు రాత్రిమాత్రం కేవలం 10 నిమిషాల్లోనే ప్రెస్ మీట్ ముగించారు. అందులోనూ ఎనిమిది నిమిషాల పాటు హుద్ హుద్‌ గురించే మాట్లాడారు. అప్పట్లో హుద్‌హుద్‌ను అలా […]

Advertisement
Update:2015-10-12 18:53 IST

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి ఏకంగా పదిన్నర గంటలకు విశాఖలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ టైమ్‌లో ప్రెస్ మీట్ ఉన్నట్టు సమాచారం రావడంతో ఏదో పెద్ద అంశంపైనే మాట్లాడుతారని మీడియా ప్రతినిధులు భావించారు. కానీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు.

సాధారణంగా ప్రెస్‌మీట్ పెడితే 45 నిమిషాలకు తగ్గకుండా మాట్లాడే చంద్రబాబు రాత్రిమాత్రం కేవలం 10 నిమిషాల్లోనే ప్రెస్ మీట్ ముగించారు. అందులోనూ ఎనిమిది నిమిషాల పాటు హుద్ హుద్‌ గురించే మాట్లాడారు. అప్పట్లో హుద్‌హుద్‌ను అలా ఎదుర్కొన్నాం… బాధితులు అది చేశాం ఇది చేశామంటూ గుర్తు చేసుకున్నారు. చివరి రెండు నిమిషాల్లో అది కూడా మీడియా ప్రతినిధులు అడగడంతో మావోయిస్టులు విశాఖ జిల్లాలో టీడీపీ లోకల్ లీడర్ల కిడ్నాప్‌పై మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అలాంటప్పుడు ఇలా కిడ్నాపులు చేయడం సరికాదని చెప్పేసి థ్యాంక్యూ అంటూ లేచి వెళ్లిపోయారు.

ప్రెస్‌మీట్ హఠాత్తుగా ముగియడంతో ఈ మాత్రం దానికి ఈ టైమ్‌లో ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారని కాసేపు మీడియా ప్రతినిధులు చర్చించుకున్నారు. చివరకు వారికి ఒక విషయం అర్థమైంది. చంద్రబాబు ప్రెస్‌మీట్‌కు జగన్ దీక్షకు లింక్‌ ఉందని తెలిసిందట. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో జగన్‌ దీక్షపై తప్పకుండా మాట్లాడుతారని అందరూ అనుకున్నారు. కానీ అలా చేయకపోవడం ద్వారా జగన్‌ దీక్షకు తాము ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న మేసేజ్ పంపేందుకు ప్రెస్‌మీట్‌ను చంద్రబాబు వాడుకున్నారని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి మనుషులు మాత్రం అలాంటిదేమీ లేదని… హుద్‌హుద్‌కు ఏడాదైన సంద్భంగానే ప్రెస్‌మీట్ పెట్టామని చెబుతున్నారు. అదే నిజమైతే ఏడాది కితం జరిగిన దానికి ఇలా ప్రత్యేకంగా రాత్రి పదిన్నరకు ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏముందన్న దానికి నో ఆన్సర్.

Tags:    
Advertisement

Similar News