చెవిరెడ్డి మరీ ఈ రేంజ్‌లో తిట్టారేంటి?
జగన్ దీక్షపై ఆరోపణలు చేసిన మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావులను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ రేంజ్‌లో తిట్టేశారు. పనిలోపనిగా ఓ సవాల్ విసిరారు. దీక్షలో జగన్ చిన్న పొరపాటు చేసినట్టు నిరూపిస్తే తమ పార్టీ 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. జగన్ తప్పుచేసినట్టు నిరూపించలేని పక్షంలో మంత్రులిద్దరూ రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే ఈ సవాల్ కోసం మంత్రులను ముఖ్యమంత్రి పంపాలన్నారు. మంత్రులు […]
జగన్ దీక్షపై ఆరోపణలు చేసిన మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావులను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ రేంజ్‌లో తిట్టేశారు. పనిలోపనిగా ఓ సవాల్ విసిరారు.
దీక్షలో జగన్ చిన్న పొరపాటు చేసినట్టు నిరూపిస్తే తమ పార్టీ 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. జగన్ తప్పుచేసినట్టు నిరూపించలేని పక్షంలో మంత్రులిద్దరూ రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే ఈ సవాల్ కోసం మంత్రులను ముఖ్యమంత్రి పంపాలన్నారు.
మంత్రులు అమ్మాఅబ్బకు —– ఉంటే, మగాళ్లయితే సవాల్ స్వీకరించాలని ఫైర్ అయ్యారు. ప్రజలకు కోసం జగన్ కడుపు మాడ్చుకుని దీక్ష చేస్తుంటే సిగ్గులేని యదవలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెవిరెడ్డి నిప్పులు చెరిగారు. ప్రెస్ ముందు మాట్లాడి పారిపోవడం కాదని మంత్రులకు దమ్ముంటే తప్పు ఎవరిదో తేల్చుకునేందుకు ముందుకు రావాలని సవాల్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో చెవిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.