ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం!
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో సదుపాయం కల్పించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఇంటర్లో డ్రాపౌట్లు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం సీఎం చంద్రశేఖర్ రావు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. మెదక్ జిల్లాలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలో […]
Advertisement
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో సదుపాయం కల్పించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఇంటర్లో డ్రాపౌట్లు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం సీఎం చంద్రశేఖర్ రావు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. మెదక్ జిల్లాలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ప్రవేశ రుసుం రద్దు చేశామని, ఉచితంగా పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తున్నామని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పెట్టనున్న ఈ పథకానికి సన్నబియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక వసతి గృహాలు, మధ్యాహ్న భోజనంలో లావు బియ్యం స్థానంలో సన్న బియ్యంతో వండిన అన్నాన్నే వడ్డిస్తున్న సంగతి తెలిసిందే!
Advertisement