ఇక దలైలామాలు ఉండరు
బౌద్దమతస్తులు అత్యంత గౌరవం ఇచ్చే ఆధ్మాత్మిక గురువు దలైలామా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక భవిష్యత్తులో టిబెట్ బౌద్ధులకు దలైలామా పేరుతో గురువులు ఉండబోరన్నారు. దలైలామా పేరుతో నాయకత్వం వహించే వారిలో తానే చివరి వ్యక్తిని కావచ్చని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. చైనా ప్రభుత్వం తనను ఆధ్మాత్మిక గురువుగా చూడానికి బదులు రాజకీయ నాయకుడిగా చూస్తోందని దలై లామా అన్నారు. తనకు ముందున్న దలై లామాలు రాజకీయంగా చురుగ్గా ఉన్నా, తాను మాత్రం రాజకీయాలకు దూరంగా […]
Advertisement
బౌద్దమతస్తులు అత్యంత గౌరవం ఇచ్చే ఆధ్మాత్మిక గురువు దలైలామా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక భవిష్యత్తులో టిబెట్ బౌద్ధులకు దలైలామా పేరుతో గురువులు ఉండబోరన్నారు. దలైలామా పేరుతో నాయకత్వం వహించే వారిలో తానే చివరి వ్యక్తిని కావచ్చని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. చైనా ప్రభుత్వం తనను ఆధ్మాత్మిక గురువుగా చూడానికి బదులు రాజకీయ నాయకుడిగా చూస్తోందని దలై లామా అన్నారు. తనకు ముందున్న దలై లామాలు రాజకీయంగా చురుగ్గా ఉన్నా, తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు తెలిపారు. చైనా అధ్యక్షుడు వాస్తవిక దృష్టితో ఆలోచించాలని దలైలామా హితవు పలికారు.
1995లో పంచన్ లామాగా ఒక బాలుడిని ప్రకటించారు. అయితే ఈ నియామకాన్ని గుర్తించడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. ప్రస్తుత దలైలామా టిబెట్ బౌద్ధులకు రాజకీయంగానూ, ఆధ్మాత్మికంగానూ దిశా నిర్దేశం చేసే నాయకుడు. టిబెట్ లో బౌద్ధులు స్వేచ్ఛ కోసం ఉద్యమించడంతో గతంలో చైనా దలైలామాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యమాన్ని కఠినంగా అణచివేసింది. ఆ కారణంగా దలైలామా1959లో భారత్ వచ్చారు. అప్పటి నుంచీ ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచే ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
చారిత్రకంగా టిబెట్ ఒకప్పుడు స్వతంత్ర దేశమని, ఈ విషయాన్ని చైనా గుర్తించాలని ఆయన అన్నారు. అయినా తాము స్వాతంత్ర్యం కోరడం లేదని, కనీస స్వేచ్ఛ కావాలని కోరుతున్నామన్నారు. చైనా నిరంకుశ పాలనను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఇకముందు టిబెట్ బౌద్ధులు దలైలామా అనే నాయకుడి మార్గదర్శనం లేకపోయినా మనుగడ సాగించగలరని ఇయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement