లిక్కర్ కింగ్ పై సీబీ'ఐ'

లిక్కర్‌ కింగ్ విజయ్‌మాల్యా చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఐడిబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్‌ పేరిట 900 కోట్ల రుణాలు తీసుకుని ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలకు కాకుండా ఇతర వ్యాపారాలకు మళ్లించారన్న ఆరోపణలు మాల్యాపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాల్యా ఇంటితోపాటు ఐదు ప్రాంతాల్లోని కింగ్ ఫిషర్ కార్యాలయాల్లో సీఐబీ దాడులు నిర్వహించింది. ముంబై, బెంగళూరు, పానాజీ, చెన్నైలో దాడులు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. గోవాలో మాల్యాకు చెందిన ఖరీదైన కింగ్‌ఫిషర్‌ విల్లాలో తనిఖీలు నిర్వహించింది. మాల్యాతో […]

Advertisement
Update:2015-10-11 14:10 IST

లిక్కర్‌ కింగ్ విజయ్‌మాల్యా చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఐడిబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్‌ పేరిట 900 కోట్ల రుణాలు తీసుకుని ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలకు కాకుండా ఇతర వ్యాపారాలకు మళ్లించారన్న ఆరోపణలు మాల్యాపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాల్యా ఇంటితోపాటు ఐదు ప్రాంతాల్లోని కింగ్ ఫిషర్ కార్యాలయాల్లో సీఐబీ దాడులు నిర్వహించింది. ముంబై, బెంగళూరు, పానాజీ, చెన్నైలో దాడులు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.
గోవాలో మాల్యాకు చెందిన ఖరీదైన కింగ్‌ఫిషర్‌ విల్లాలో తనిఖీలు నిర్వహించింది. మాల్యాతో పాటు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైనన్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఎ. రఘునాథన్‌తో పాటు ఐడిబీఐకి చెందిన అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఐడిబీఐ బ్యాంకు రుణం ఇవ్వక ముందే కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. అంతకు ముందే బ్యాంకుల కన్సార్టియం కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు వేలాది కోట్ల రూపాయిలు రుణాలు ఇచ్చిన విషయం తెలుసు.
ఆ బ్యాంకులే మాల్యా నుంచి అప్పులు రాబట్టుకోలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసీ ఐడీబీఐ బ్యాంకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు 900 కోట్ల రుణం ఎలా ఇచ్చిందన్నదానిపై విచారణ జరుగుతోంది. అప్పటికే వివిధ బ్యాంకులు విజయ్‌ మాల్యాను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారునిగా ప్రకటించాయి. 2014లోనే ఐడీబీఐపై ప్రాథమిక విచారణ మొదలు పెట్టింది సీబీఐ. ఈ వ్యవహారంతో మాల్యా మరోసారి చిక్కుల్లో పడినట్టేనని మార్కెటింగ్ నిపుణులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News