హై హై.. వై ఫై..

విశ్వనగరంగా మారబోతున్న హైదరాబాద్ లో సాంకేతికంగా మారో మైలురాయిని దాటింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉచిత వైఫై అందిస్తున్న నగరంగా మారింది. దేశంలోనే తొలి వై ఫై నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మహానగరంలోని మరో 11 రద్దీ ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు అందించేందుకు బీఎస్ ఎన్ఎల్ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే 20 ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు అందిస్తున్న బీఎస్ఎన్ఎల్.. డిసెంబర్ 31లోపు పూర్తిస్థాయిలో ఉచిత వై ఫై […]

Advertisement
Update:2015-10-08 18:37 IST

విశ్వనగరంగా మారబోతున్న హైదరాబాద్ లో సాంకేతికంగా మారో మైలురాయిని దాటింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉచిత వైఫై అందిస్తున్న నగరంగా మారింది. దేశంలోనే తొలి వై ఫై నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మహానగరంలోని మరో 11 రద్దీ ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు అందించేందుకు బీఎస్ ఎన్ఎల్ సంస్థ సిద్ధమైంది.
ఇప్పటికే 20 ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు అందిస్తున్న బీఎస్ఎన్ఎల్.. డిసెంబర్ 31లోపు పూర్తిస్థాయిలో ఉచిత వై ఫై సేవలను విస్తరించాలని భావిస్తోంది. వారం రోజుల్లోనే జూపార్క్ లో ఉచిత వై ఫై సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. నగరంలో మూడు రకాల హాట్ స్పాట్స్ ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేస్తోంది. ఒక్కో హాట్ స్పాట్ కు ఐదు వైఫై టవర్స్ అనుసంధానం చేస్తారు. పది కిలోమీటర్లకు ఒక జోన్ గా పరిగణించి ఒక్కో టవర్ 5 నుంచి 10 కిలో మీటర్ల దూరం వరకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ హాట్ స్పాట్స్ నుంచి ఉచిత వైఫై సేవలను ఒక మొబైల్ ద్వారా నెలకు మూడుసార్లు 30 నిమిషాల చొప్పున వాడుకోవచ్చు. ఆ తర్వాత ఓచర్ బేస్డ్ సర్వీసెస్, ఈ-ఓచర్ బేస్డ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ ఓచర్స్ కోసం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు. తక్కువ రేట్లలో వినియోగదారులకు అందేలా బీఎస్ఎన్ఎల్ ఏర్పాట్లు చేసింది.

Tags:    
Advertisement

Similar News