మోదీపై రాహుల్ పిట్ట కథ!
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన గురువారం రోహతాస్ జిల్లా బెగుసారాయ్, షేక్‌పురాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాలన, వస్త్రధారణలపై చురకలంటించారు. ఆయనకు సామాన్యుల వెతలు పట్టవని, తాను ప్రశ్నించినప్పటి నుంచే మోదీ రూ.15 లక్షల సూటు వేయడం మానేశారని తెలిపారు. మోదీ పాలనను విమర్శిస్తూ ఓ పిట్ట కథ కూడా చెప్పారు. కథేంటంటే..? ఓ పడవ నడిపే వాడు- ఓ సూటు బూటు మనిషి నదిలో ఓ పడవలో […]
Advertisement
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన గురువారం రోహతాస్ జిల్లా బెగుసారాయ్, షేక్‌పురాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాలన, వస్త్రధారణలపై చురకలంటించారు. ఆయనకు సామాన్యుల వెతలు పట్టవని, తాను ప్రశ్నించినప్పటి నుంచే మోదీ రూ.15 లక్షల సూటు వేయడం మానేశారని తెలిపారు. మోదీ పాలనను విమర్శిస్తూ ఓ పిట్ట కథ కూడా చెప్పారు.
కథేంటంటే..?
ఓ పడవ నడిపే వాడు- ఓ సూటు బూటు మనిషి నదిలో ఓ పడవలో ప్రయాణిస్తున్నారు. సూటు బూటు మనిషి పడవ నడిపేవాడిని నీకు సైన్సు తెలుసా? అని అడిగాడు. అతడు తెలియదన్నాడు పడవవాడు. నీకు గణితం తెలుసా? అని అడిగాడు.. ఈ సారి కూడా ఈ పడవనడిపేవాడు తెలియదు సారూ! అని సమాధానమిచ్చాడు. కనీసం నీకు ఇంగ్లిష్ వచ్చా? అని అడిగాడు. అది కూడా రాదయ్యా! అని సమాధానమిచ్చాడు.. దీంతో ఎందుకయ్యా నీజీవితం ఇవేమీ రాకపోతే..75% జీవితం దండగ అని ఎగతాళి చేశాడు సూటుబూటు మనిషి. అప్పుడే పడవకు కన్నంపడి మునిగిపోతోంది.. దీంతో పడవాడు అడిగాడు.. సార్ ! మీకు ఈత వచ్చా? అని రాదన్నాడు సూటు-బూటు మనిషి. అయితే మీ జీవితం 100 శాతం వృథా అని పడవలోనుంచి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు పోయాడు పడవవాడు..
సరిగ్గా మోదీ పాలన కూడా ఇలాగే ఉందని రాహుల్ ఎద్దేవా చేశాడు. ఆయనకు సామాన్యుల అవసరాలు, రైతుల కష్టాలు తెలియవని విమర్శించాడు. ఆయనను మీరెప్పుడైనా నిరుద్యోగులు, సామాన్యులు, రైతులతో మాట్లాడటం చూశారా? అని సభికులను ప్రశ్నించారు. ఎప్పుడుచూసినా ఆయన సూటు-బూటు వేసుకున్నవారితో కనిపిస్తారని మండిపడ్డారు. అతనికి సామాన్యులు ఏం చెబుతున్నారన్న దానిపై ఆసక్తి లేదని అందుకే మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల ద్వారా కేవలం ఆయన సందేశాన్ని మాత్రమే వినిపిస్తున్నారని ఎగతాళి చేశారు.
తాను ప్రశ్నించినప్పటి నుంచే మోదీ రూ.15 లక్షల సూటు వేయడం మానేశారని వెల్లడించారు. బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి, బీజేపీని ఓడించి తగిన బుద్ధి చెబుతామని ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబరు 19 తరువాత ఆయన పాల్గొన్న తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం!
Advertisement