తోసుకున్నారు.. తన్నుకున్నారు!

జమ్ము కాశ్మీర్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. కాశ్మీర్ అసెంబ్లీ గత మూడు రోజులుగా రణరంగమవుతోంది. బీఫ్ బ్యాన్ కు అనుకూల, వ్యతిరేక నినాదాల హోరుతో సభ దద్దరిల్లింది. గురువారంఏకంగా ఎమ్మెల్యేలు కొట్టుకునే వరకూ వెళ్లింది.  ఇటీవల గోమాంసం విక్రయంపై కాశ్మీర్ లో  హైకోర్టు నిషేధం విధించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అసెంబ్లీలో కూడా విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. చర్చకు అవకాశం లేకుండా […]

Advertisement
Update:2015-10-09 04:41 IST

జమ్ము కాశ్మీర్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. కాశ్మీర్ అసెంబ్లీ గత మూడు రోజులుగా రణరంగమవుతోంది. బీఫ్ బ్యాన్ కు అనుకూల, వ్యతిరేక నినాదాల హోరుతో సభ దద్దరిల్లింది. గురువారంఏకంగా ఎమ్మెల్యేలు కొట్టుకునే వరకూ వెళ్లింది.
ఇటీవల గోమాంసం విక్రయంపై కాశ్మీర్ లో హైకోర్టు నిషేధం విధించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అసెంబ్లీలో కూడా విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. చర్చకు అవకాశం లేకుండా చేశారు. కాశ్మీర్ లో బీఫ్‌ బ్యాన్ ను నిరసిస్తూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ ఏకంగా బీఫ్ ఫెస్ట్ నిర్వహించి స్థానికులకు ఉచితంగా మాంసాన్ని పంచారు. ఇది బీజేపీ నాయకులకు తీవ్ర ఆగ్రహం కలిగించించింది.
ఈ ఘటనపై బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆయన్ని ప్రశ్నించారు. ఇలా ఎందుకు చేశావని నిలదీశారు. బీఫ్ తినాలా వద్దా అన్నది తన ఇష్టమని ఆయన సమాధానం చెప్పారు. దీంతో బీజేపీ సభ్యులు ఆయనపై చేయి చేసుకున్నారు. అంతే పరస్పరం తోపులాటకు దిగారు. ఒకరిపై ఒకరు చేసుకోవడంతో సభ యుద్ధభూమిగా మారింది.

Tags:    
Advertisement

Similar News