హైకోర్టు ఉత్తర్వులు- అగ్రిగోల్డ్‌కు ముందస్తు హెచ్చరిక

అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల అమ్మకాన్ని పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆస్తుల అమ్మకం పర్యవేక్షణతో పాటు బాధితులకు నగదు చెల్లింపు వ్యవహారాన్ని కూడా ఈ కమిటీ పర్యవేక్షణలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఆస్తుల విక్రయాన్ని పారదర్శకంగా ఈ వేలంలో నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. లావాదేవీల కోసం హైకోర్టు రిజిస్ట్రార్ పేరుతో ప్రత్యేక అకౌంట్ తెరవాలని చెప్పింది. తొలి విడతలో 14, రెండో విడతలో ఐదు ఆస్తులను […]

Advertisement
Update:2015-10-09 09:18 IST

అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల అమ్మకాన్ని పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆస్తుల అమ్మకం పర్యవేక్షణతో పాటు బాధితులకు నగదు చెల్లింపు వ్యవహారాన్ని కూడా ఈ కమిటీ పర్యవేక్షణలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఆస్తుల విక్రయాన్ని పారదర్శకంగా ఈ వేలంలో నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది.

లావాదేవీల కోసం హైకోర్టు రిజిస్ట్రార్ పేరుతో ప్రత్యేక అకౌంట్ తెరవాలని చెప్పింది. తొలి విడతలో 14, రెండో విడతలో ఐదు ఆస్తులను విక్రయించాలని హైకోర్టు సూచించింది. ఆస్తుల అమ్మకంపై కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని అగ్రిగోల్డ్ సంస్థకు హైకోర్టు ముందుస్తు హెచ్చరిక జారీ చేసింది. లావాదేవీలపై ఎప్పటికప్పుడు వివరాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. కమిటీకి నేతృత్వం వహించే రిటైర్డ్ జడ్జి పేరును సోమవారం హైకోర్టు ప్రకటించనుంది.

Tags:    
Advertisement

Similar News