మిషన్‌ కాకతీయ ట్రస్ట్‌కు కేంద్రం అనుమతి

విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏర్పాటు చేసిన మిషన్‌ కాకతీయ ట్రస్ట్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున చేపట్టిన ఈ ప్రాజెక్టుకు విదేశాల నుంచి కూడా విరాళాలలివ్వడానికి దాతలు ముందుకు రావడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని అనుమతి కోసం కేంద్రాన్ని కోరగా మిషన్ కాకతీయ ట్రస్ట్ ద్వారా విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ […]

Advertisement
Update:2015-10-07 18:37 IST

విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏర్పాటు చేసిన మిషన్‌ కాకతీయ ట్రస్ట్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున చేపట్టిన ఈ ప్రాజెక్టుకు విదేశాల నుంచి కూడా విరాళాలలివ్వడానికి దాతలు ముందుకు రావడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని అనుమతి కోసం కేంద్రాన్ని కోరగా మిషన్ కాకతీయ ట్రస్ట్ ద్వారా విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ వెల్లడించారు. మొదటిదశ మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లోని వేలాది చెరువులు బాగు చేశారు. ఇప్పుడవి నిండుకుండలా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులకు పునర్‌ వైభవం కల్పించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లబించింది. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో భాగంగా మిషన్ కాకతీయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News