wonder world 51
చెక్కతో సూపర్ బైక్! చెక్కతో బైకా… నడుస్తుందా లేక షోకేసులోకా అనుకోకండి. నిక్షేపంగా రోడ్లపై పరుగులు పెడుతోంది. హంగేరికి చెందిన ఇస్త్‌వన్ పుస్కాస్ ఈ బైక్‌ను తయారు చేశాడు. అతనికి మోటర్‌బైక్‌లంటే తగని పిచ్చి. కానీ కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. అందుకే ఇలా చెక్కతో బైక్ తయారుచేసుకున్నాడు. ఈ బైక్ పేరు ‘ఛాపర్’. పుస్కాన్ రెండేళ్లపాటు శ్రమించి ఈ బైక్‌ను తయారుచేశాడట. గతంలో ఇలా చెక్కతో చాలామందే బైక్‌లు, సైకిళ్లు తయారుచేసినా పుస్కాన్ బైక్ మాత్రమే సిసలైన బైక్‌గా […]
By - sarviUpdate:2015-10-07 10:34 IST
చెక్కతో సూపర్ బైక్!
చెక్కతో బైకా… నడుస్తుందా లేక షోకేసులోకా అనుకోకండి. నిక్షేపంగా రోడ్లపై పరుగులు పెడుతోంది. హంగేరికి చెందిన ఇస్త్‌వన్ పుస్కాస్ ఈ బైక్‌ను తయారు చేశాడు. అతనికి మోటర్‌బైక్‌లంటే తగని పిచ్చి. కానీ కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. అందుకే ఇలా చెక్కతో బైక్ తయారుచేసుకున్నాడు. ఈ బైక్ పేరు ‘ఛాపర్’. పుస్కాన్ రెండేళ్లపాటు శ్రమించి ఈ బైక్‌ను తయారుచేశాడట. గతంలో ఇలా చెక్కతో చాలామందే బైక్‌లు, సైకిళ్లు తయారుచేసినా పుస్కాన్ బైక్ మాత్రమే సిసలైన బైక్‌గా గుర్తింపుపొందింది. ఎందుకంటే ఇది మామూలు బైక్‌ల మాదిరిగా రోజూ ఉపయోగించుకోవచ్చు. హంగేరిలో దొరికే అరుదైన బ్లాక్ లోకస్ట్ రకం చెక్కతో దీనిని తయారుచేశారు. ఇది చాలా బలమైన చెక్క. చాలా దృఢంగా ఉంటుంది. టేకుకన్నా గట్టిగా ఉంటుంది. అంత సులభంగా విరగదు. అంతేకాదు తడిసినా పాడవదు.
హంగేరి రాజధాని బుడాపెస్ట్‌కి 161 కిలోమీటర్ల దూరంలోని టిస్జారోస్‌లో నివసించే పుస్కాన్ చెక్కతో వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తుంటాడు. మన గ్రామాల్లో వడ్రంగి మాదిరిగానన్నమాట. బైక్ నడపాలని విపరీతంగా కోరిక ఉన్నా కొనేందుకు డబ్బు మాత్రం లేదు. అయితేనేం తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాడు. టైర్లు, వైర్లు, ఇంజను మినహా మిగిలిన భాగాలన్నీ చెక్కతో తయారు చేసినవే. పుస్కాన్ తయారు చేసిన బైక్ ప్రపంచంలో ‘రోడ్లపై నడపడానికి అనువైన మొట్టమొదటి చెక్క బైక్’గా గుర్తింపు పొందింది.